
📌 Key Points
- అనసూయ వస్త్రధారణపై బీజేపీ మహిళా నేత ప్రభ గౌడ చీర ఛాలెంజ్
- అనసూయకు చీర పంపించి సరిగ్గా దుస్తులు ధరించడం నేర్పించాలని ఛాలెంజ్ విసిరిన మహిళా నేత
- ప్రభా గౌడ వ్యాఖ్యలపై చిన్మయి తీవ్రంగా స్పందించారు
- మహిళలను వేధించడానికి రాజకీయ నాయకులకు సమయం ఉంటుందా అని చిన్మయి ప్రశ్నించారు
టాలీవుడ్ సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేత అనసూయకు చీర ఛాలెంజ్ విసరడంపై చిన్మయి తీవ్రంగా స్పందించారు.
అనసూయకు బీజేపీ నేత చీర ఛాలెంజ్
Chinmayi Sripaada: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళల గురించి ఎవరైనా కామెంట్లు చేస్తే తనదైన శైలిలోనే సమాధానాలు చెబుతూ వివాదాలలో నిలుస్తుంటారు. ఇటీవల శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలపై చిన్మయి కూడా ఘాటుగా స్పందించారు. ఇక ఈ వివాదంలో అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అనసూయ, చిన్మయి పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరు తమదైన శైలిలోనే కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా బిజెపి మహిళ నేత ప్రభ గౌడ (Prabha Gowda)అనసూయ(Anasuya)కు చీర ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనసూయ వస్తదరణ విషయంలో చాలామంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో అనసూయ కంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో సంస్కారవంతంగా ఉన్నారు. వారిని చూసి అనసూయ నేర్చుకోవాలని ప్రభా గౌడ తెలిపారు. ఎవరైతే అనసూయ కూడా చాలా పద్ధతిగా చీర కట్టుకొని ఉండాలి అనుకుంటారో వారందరూ కూడా నాలాగా తనకు ఒక చీరను పంపించండని ఈమె అనసూయకు చీర ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో పట్ల ఎంతోమంది స్పందిస్తూ మీరు చెప్పింది కరెక్టే అంటూ మహిళ నేతకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సింగర్ చిన్మయి (Chinmayi)ఈ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రభా గౌడకు సంబంధించిన ఈ పోస్టును చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. బీజేపీ మహిళా నాయకురాలు అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయకు చీర పంపించి సరిగ్గా దుస్తులు ధరించడం నేర్పించండి అంటూ ప్రజలకు ఒక ఛాలెంజ్ చేస్తుంది. బట్టలు కోసం స్త్రీలను ఏమాత్రం సిగ్గు పడకూడదనే అభిప్రాయం కోసం ఒక మహిళ ఇతర మహిళలను వేధించడంలో ఇలాంటి ఆలోచన కలిగే ఉంటుందని తాను అస్సలు అనుకోలేదు. ఈ ప్రపంచంలో ప్రతి చోట రాజకీయ నాయకులకు స్త్రీలను వేధించడానికి ఇంత సమయం ఉంటుందా అంటూ చిన్మయి మహిళా నేతకు కౌంటర్ ఇస్తూ ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
చిన్మయి ఘాటుగా స్పందన
So a female BJP politician here is ‘challenging’ people to send a Sari to Anasuya to ‘teach her to dress properly’.
I really didn’t think I would see this sort of horrendously deranged and regressive thinking would exist with women harassing other women for JUST AN OPINION to… pic.twitter.com/1QqmwUSlTZ
— Chinmayi Sripaada (@Chinmayi) January 16, 2026
దుస్తులపై వేధింపులా? చిన్మయి ఆగ్రహం
చిన్మయి చేసిన ఈ పోస్టుపై ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మరి అనసూయకు చీర ఛాలెంజ్ విషయంపై అనసూయ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. శివాజీ ఒక సినిమా వేడుకలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ వివాదంగా మారుతూనే ఉన్నాయి శివాజీ విషయంలో క్షమాపణలు చెప్పి సైలెంట్ అయిన ఈ వివాదంపై పెద్ద ఎత్తున రాజకీయ నాయకురాళ్లు మహిళా సంఘాల నేతలు కూడా స్పందించడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
చిన్మయి స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళల వస్త్రధారణపై జరుగుతున్న చర్చలు, వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.


