|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవినే దిక్కు! ఇండస్ట్రీకి పెద్ద లేరన్న వాళ్లకు మెగాస్టార్ సమాధానం ఇదేనా?

Published: 13-03-2026, 1:35 PM
చిరంజీవినే దిక్కు! ఇండస్ట్రీకి పెద్ద లేరన్న వాళ్లకు మెగాస్టార్ సమాధానం ఇదేనా?
  • తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద లేరని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.
  • దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదని ఆయన అన్నారు.
  • కానీ, పరిశ్రమకు కష్టం వస్తే చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని పలువురు అంటున్నారు.
  • చిరంజీవి ఎవరికీ పంచాయితీలు చేయకపోయినా, అవసరమైన వారికి సహాయం చేస్తానని చెప్పారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరని చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. కష్టమొస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

తమ్మారెడ్డి వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy).. అక్కడ నీడ్ ఉన్నా, లేకున్నా.. ఏ వేడుకకు హాజరైనా టాలీవుడ్ పెద్దరికం గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద అనే వారే లేరు. ఒకప్పుడు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీలోని వారంతా ఆయన దగ్గరకు వెళ్లడంతో, ఆయనని పెద్దగా భావించారు. ఆయన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద అనే వారు ఎవరూ లేరు, రారు, ఉండరు.. అనేలా రీసెంట్‌గా కూడా ఓ స్టేజ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా అనే కాదు, ఎక్కడ, ఏ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినా ఇదే విషయం పదే పదే చెబుతూ, అటెన్షన్ పొందుతున్నారు. అంత పెద్ద మనిషి, అంత మెచ్యురిటీ ఉన్న మనిషి కావాలని కాకపోతే, దీనిని బూచిలాగా చూపించాల్సిన అవసరం లేదు. ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నారనేది ఇండస్ట్రీ వాళ్లకి తెలుసు, మీడియా వాళ్లకి కూడా తెలుసు. అయినా కూడా పదే పదే అదే ప్రశ్న వేస్తుంటుంది మీడియా. ఇక అసలు విషయంలోకి వద్దాం..

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఉన్నారు. తమ్మారెడ్డి అవునన్నా, కాదన్నా.. ఇండస్ట్రీకి పెద్ద, పెద్దన్న (Industry Big Brother) ఎవరయ్యా అంటే.. కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవే (Megastar Chiranjeevi). అవును, పదిమంది కొట్టుకునే పంచాయితీలను ఆయన తీర్చకపోవచ్చు. కానీ, ఆ పది మందికి అవసరం ఉంటే గుర్తొచ్చే పేరు మాత్రం చిరంజీవే. స్వయంగా చిరంజీవే ఈ విషయం చెప్పారు. ‘ఇద్దరు వ్యక్తులు లేదంటే యూనియన్ల మధ్య గొడవలు తీర్చే పంచాయితీలు నేను చేయను. అలాంటి పెద్దరికం నాకు వద్దు. కష్టం అని వస్తే మాత్రం, అలాంటి వాళ్లకి మా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది’ అని చిరంజీవి ఆ మధ్య ఓ వేడుకలో చెప్పారు. అవును, ఇండస్ట్రీకి కష్టం వచ్చినా, ఇండస్ట్రీలోని కార్మికులకు కష్టం వచ్చినా, ఇండస్ట్రీని నమ్ముకున్న మీడియా వాళ్లకి కష్టం వచ్చినా.. ఆయన నిలబడుతూనే ఉన్నారు.. మాట నిలబెట్టుకుంటూనే ఉన్నారు. దీనికంటే, పెద్దరికం ఇంకేం కావాలి. ఒక రూపాయి జేబులో నుంచి తీయడం చేతకాని వాళ్లు కూడా.. మేమే పెద్దలమని చెప్పుకోవడానికి ఆలోచించడం లేదు. అలాంటిది, కష్టం అంటే కోట్ల రూపాయలను ఇచ్చే చిరంజీవి కాక ఇంకెవ్వరు ఇండస్ట్రీకి పెద్ద.

చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారా?

సరే, తమ్మారెడ్డి చెప్పిన విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు కదా.. మరి, ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా చిరంజీవి దగ్గరకే ఎందుకు వెళుతున్నారు? ఎటువంటి ఎన్నికలు జరిగినా, ముందు చిరంజీవి దగ్గరకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. తాజాగా ఎన్నికైన యువ దర్శకుల సంఘం కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకుంది. ఇండస్ట్రీలో పెద్ద ఎవరూ లేరు కదా.. మరి వాళ్లెందుకు వెళ్లి ఉంటారు. వాళ్లు అనే కాదు, ఎంతో మంది ఈ మధ్య చిరంజీవి గడప తొక్కిన వారిలో ఉన్నారు. వాళ్లందరికీ తెలియదా? ఆయనేం పెద్ద కాదని. సో.. ఇండస్ట్రీ‌లో ఎవరు ఏంటనేది? అందరికీ తెలుసు.. సమయం వచ్చినప్పుడు వాళ్ల రియాక్షన్ చూపిస్తారు. అంతేకానీ, పదే పదే ఈ టాపిక్‌పై మాట్లాడి తమ్మారెడ్డి వంటి వారు తమ స్థాయిని దిగజార్చుకోవడం కాకపోతే.. ఇంకోటి కాదు. ఇకనైనా కాస్త తెలుసుకుని మసులుకుంటే మంచిది.

చిరంజీవి తన సహాయ గుణం ద్వారా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండటం గొప్ప విషయమని పలువురు కొనియాడుతున్నారు. ఆయన చేస్తున్న సాయం ఎంతోమందికి ఆదర్శం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.