
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
- సినీ, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదని జయసుధ వ్యాఖ్యానించారు.
- రాజకీయాలలో తట్టుకుని నిలబడి అనుకున్న లక్ష్యాన్ని పవన్ చేరుకున్నారని జయసుధ తెలిపారు.
- ఓజీ సినిమా ద్వారా విజయం అందుకున్న పవన్, ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
నటి జయసుధ తాజాగా పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదని, ఆయన ఎవరికీ తలవంచలేదని జయసుధ పేర్కొన్నారు. రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఆయన సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం
Jayasudha on Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ అటువైపుగా అడుగులు వేశారు ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితం పట్ల ఇదివరకు ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ వాటన్నింటిని ధీటుగా ఎదుర్కొని ఆయన అనుకున్నది సాధించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితంపై నటి జయసుధ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ దే.. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలలో ఉన్న ఇప్పటివరకు ఏమాత్రం మారలేదని, ఎవరికి ఎక్కడ తలవంచ లేదని జయసుధ తెలిపారు. రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో తట్టుకొని నిలబడటం అంటే కష్టం కానీ పవన్ కళ్యాణ్ వెనక్కి తిరగకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేరారని జయసుధ తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆయన కోరుకున్న విధంగా నిర్మాతలు చూసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అవన్నీ వదులుకొని రాజకీయాలలోకి వెళ్లిపోయారని రాజకీయాలలో నటించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదు అంటూ ఈమె తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
జయసుధ దృష్టిలో పవన్ యాటిట్యూడ్
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాను అంటే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆయన కోసమే ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో కాకుండా ప్రజా సేవ చేయడానికే రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ఇదివరకు కమిట్ అయిన సినిమాలో షూటింగ్స్ అన్ని పూర్తి చేశారు. కొత్త సినిమాలకు కూడా కమిట్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారకంగా వెల్లడించలేదు.
ఇదివరకు ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని 2026 మార్చి నెలలో విడుదల చేయబోతున్నారంట సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన వెలువడ లేదు. ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ భవిష్యత్ సినిమా ప్రాజెక్ట్‌లు
మొత్తం మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ ప్రస్థానంపై జయసుధ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన నిజమైన లక్ష్యానికి, నిబద్ధతకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.


