
📌 Key Points
- ధనుష్ 55వ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.
- ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్నారు.
- మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
- మమ్ముట్టి పాత్ర సినిమాకు ఒక ముఖ్యమైన మలుపు తిప్పుతుందని సమాచారం.
ధనుష్ తన కెరీర్ లో 55వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నటిస్తుండటం విశేషం. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ధనుష్ 55వ సినిమా వివరాలు
D55 Movie : ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో ఇతర భాషలలో మార్కెట్ దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఇతర భాష స్టార్ హీరో, హీరోయిన్లను కూడా సినిమాలలో భాగం చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే ఒక హీరో సినిమాలో ఇతర భాషలలో స్టార్లుగా కొనసాగుతున్న వారు కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) సినిమాలో కూడా మలయాళ స్టార్ హీరో నటించబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం నటుడు ధనుష్ భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగులో కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం తన కెరియర్లో 55వ సినిమా చేయబోతున్నారు. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి(Raj Kumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చిత్ర నిర్మాతలు వరుస అప్డేట్స్ తెలియజేస్తూ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి పల్లవి (Sai Pallavi), శ్రీలీల(Sreeleela) నటించబోతున్నారనే విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం ఈయనకు స్వాగతం పలుకుతూ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇలా ధనుష్ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర కీలకంగా ఉండబోతుందని సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
కీలక పాత్రలో మమ్ముట్టి
When the Big M chooses a story, it becomes history 🔥
Super excited to welcome Megastar @mammukka onboard #D55 !
We are honoured! Thank you #Mammootty sir. @dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @Sai_Pallavi92 @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905 … pic.twitter.com/f21kdflsbR
సినిమాపై అంచనాలు
— Wunderbar Films (@wunderbarfilms) February 4, 2026
ఇక ధనుష్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మించబోతున్నారు. అమరన్ లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ డైరెక్షన్లో ధనుష్ అంటే నీకు సినిమా పట్ల అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం విశేషం ఇదివరకు సాయి పల్లవి ధనుష్ కాంబినేషన్లో మారి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది ఈ నేపథ్యంలోనే మరోసారి సూపర్ హిట్ జోడి జతకట్టబోతున్నారని విషయం సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించనున్నారు.
మొత్తానికి ధనుష్ సినిమాలో మమ్ముట్టి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


