|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈషా రెబ్బా! అసలేం జరిగిందో తెలుసా?

Published: 04-02-2026, 8:05 AM
షాకింగ్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈషా రెబ్బా! అసలేం జరిగిందో తెలుసా?
  • ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కామెంట్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
  • నటి తరుణ్ భాస్కర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.
  • త్వరలోనే ఈషా రెబ్బా పెళ్లి గురించి శుభవార్త చెప్పే అవకాశం ఉంది.

ప్రముఖ నటి ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరంగా కామెంట్లు చేసిన వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఈషా రెబ్బా ఫిర్యాదు

Eesha Rebba: ఈషా రెబ్బా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తో కలిసి నటించిన ఈ సినిమా మలయాళ సినిమాకు రీమేక్ సినిమా కావటం విశేషం అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈశారెబ్బా తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (banjara hills police station ) ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

ఈషా రెబ్బ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేయడంతో ఈమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పక్క ఆధారాలతో ఇంస్టాగ్రామ్ ఐడిలతో సహా ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకోవడమే కాకుండా ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది ఫేక్ ఐడీలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే కొంతమంది వీటిని చూసి చూడనట్టు వదిలేయగా, మరికొందరు ఇలాంటి వాటిపై రియాక్ట్ అవుతూ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బ కూడా తన గురించి అసభ్యకర కామెంట్లు చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈషా రెబ్బా కెరియర్ పరంగా ప్రస్తుతం పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈషా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తరుణ్ భాస్కర్ తో ఈమె ప్రేమలో పడ్డారంటూ వస్తున్న వార్తలపై ఇటీవల తరుణ్ భాస్కర్ కూడా స్పందించారు. ఈషా రెబ్బ తనకు ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ అని తెలిపారు. అయితే మా ఇద్దరి రిలేషన్ గురించి సరైన సమయం చూసుకొని తాను ప్రకటిస్తానని, నేను చెప్పే ఈ ప్రకటనతో కొంతమంది ఇబ్బందులు పడతారని అలా వారు ఇబ్బంది పడకుండా ఈ విషయాన్ని ప్రకటిస్తానని తరుణ్ భాస్కర్ చెప్పిన సంగతి తెలిసిందే.. అతి త్వరలోనే ఈ జంట తమ పెళ్లి గురించి శుభవార్త చెప్పబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక తరుణ్ భాస్కర్ ఇదివరకే వివాహం చేసుకొని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఇలా ఆమె నుంచి విడిపోయిన తర్వాత ఈషా ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బా రిలేషన్

ఈషా రెబ్బా ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.