
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. రోహిణి, చింటు కోసం పడే ఆవేదన, మీనాను ఇంటి నుండి దూరం చేయడానికి ఆమె వేసిన ప్లాన్ ఆసక్తికరంగా మారాయి. మీనా బయటకు వెళ్లడంపై బాలుకు అనుమానం కలగడం కథనానికి మరింత ఉత్కంఠను జోడించింది.
Key Points
చింటు ప్రేమ కోసం రోహిణి కలలు కంటుంది, మీనా స్థానంలో తాను లేనని బాధపడుతుంది.
మీనాను ఇంటి నుండి బయటకు పంపించడానికి విద్యతో కలిసి రోహిణి ఒక ప్లాన్ వేస్తుంది.
పూల కట్టే పోటీ సాకుతో మీనాను బయటకు పంపాలని విద్య ప్రయత్నిస్తుంది.
మీనా బయటకు వెళ్లడంపై బాలుకు అనుమానం వచ్చి, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు.
రోహిణి ప్రణాళిక: మీనాను పంపేందుకు వ్యూహం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు అమ్మ అంటూ హాల్లోకి రావడంతో దగ్గరికి తీసుకుని రోహిణి ఏడుస్తుంది. నువ్ మా అత్తవి కాదుగా. మా అమ్మవేగా అని చింటు అంటే.. అవునురా. నువ్వు నా కన్న కొడుకువే. నా బంగారం అని రోహిణి అంటుంది. ఆ మాటలన్నీ విన్న మనోజ్, మీనా, బాలు నిలదీస్తారు.
అదంతా కల గంటుంది రోహిణి. లేచి వెళ్లి చింటుని చూస్తుంది. చింటు పక్కన మీనా పడుకుని ఉంటుంది. నీకు తల్లిగా ప్రేమ పంచలేదురా అని రోహిణి బాధపడుతుంది. ఇంతలో చింటు అమ్మా అంటూ లేస్తే మీనా ఓదారుస్తుంది. కనీసం మీనా ఉన్న స్థానంలో కూడా నేను లేకుండా పోయాను. క్షమించు నాన్న అని రోహిణి అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం జరిగినదంతా తన ఫ్రెండ్ విద్యకు చెబుతుంది రోహిణి. చింటు నీ గొంతు గుర్తుపడితే చాలా పెద్ద సమస్య అవుతుంది అని విద్య అంటే.. నాకు దినదినగండంగా ఉంది. బాలు, మీనా వాడితోనే ఉంటున్నారు అని రోహిణి అంటుంది. మీనా వాళ్లకు చింటు నిజం చెబితే నీ బతుకు బజారుపాలు అవుతుందని విద్య అంటుంది.
మా అమ్మ, కొడుకును బయటకు పంపించాలంటే మీనాను బయటకు పంపించాలి. దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని విద్యకు చెబుతుంది రోహిణి. మరోవైపు చింటుకి మీనా ఇడ్లీ తినిపిస్తుంటుంది. ఇంతలో రోహిణి వచ్చి ఫీల్ అవుతుంది. చింటుకి టిఫిన్ చేయించి మీనా వెళ్లిపోతుంది. నేను చేయాల్సిన పనులన్నీ మీనా చేస్తుందేంటీ అని తల్లిని అంటుంది రోహిణి.
మీనాపై బాలు అనుమానం
మీనా ప్రేమతో చేస్తుంది అని రోహిణి తల్లి సుగుణ చెబుతుంది. మరోవైపు మీనాకు విద్య కాల్ చేసి తాను రోహిణి ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంటుంది. మా అపార్ట్‌మెంట్‌లో పూలు కట్టే పోటీ ఉంది. నీ మీద నమ్మకంతో నా పేరు ఇచ్చాను. నువ్వు నాకు పూలు కట్టడం నేర్పించు అని బతిమిలాడుతుంది విద్య. ముందు ఒప్పుకోని మీనా తర్వాత ఒప్పుకుంటుంది.
తర్వాత విద్య విషయం చెప్పి బయటకు వెళ్తున్నట్లు బాలుకు చెబుతుంది మీనా. ఎప్పుడు చేయని అమ్మాయి కాల్ చేయడం ఏంటీ. నాకు అనుమానంగా ఉంది. తన మొహాన్ని చూశావా కన్నాలు వేసుకున్నట్లు ఉంటుంది. పైగా పార్లరమ్మకు సంబంధించిన వాళ్లను అస్సలు నమ్మలేం. నువ్వు అడ్రస్ పంపించు. నేను చెప్పిన వెంటనే రావాలి. ఎందుకంటే నువ్ నా బుజ్జి పూలగంపవి కదా అని బాలు అంటాడు.
మరోవైపు మీనా వంటవల్ల ఎక్కువ తినడంతో ఆయాసంగా ఉందని రవి అంటాడు. నువ్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే మీనాను చెఫ్‌గా పెట్టుకో అని శ్రుతి అంటుంది. నేను పనికిరానా అని రవి అంటాడు. ఏ పని చేతకాని మీ మనోజే పెద్ద బిజినెస్‌మ్యాన్‌లా పోజులు కొడుతున్నాడు. నువ్వు రెస్టారెంట్ ఓనర్‌లా ఉండాలి అని శ్రుతి అంటుంది. ఇంతలో రోహిణి వచ్చి లేట్ అయిందా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందిగా అని చెప్పి రవి, శ్రుతి త్వరగా వెళ్లిపోయేలా చేస్తుంది.
తర్వాత సత్యం, ప్రభావతిని బయటకు పంపించాలిగా అని అనుకుంటుంది రోహిణి. మీనా లేదని అరిచిన ప్రభావతి తన కాఫీ తనే పెట్టుకుంటానంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. ప్రభావతి దగ్గరికి వెళ్లిన రోహిణి వచ్చిన పెద్దావిడా వాళ్లు ఇంకా ఉన్నారు. చూస్తుంటే మరో వారం ఉండేలా ఉన్నారు అని రోహిణి అంటుంది. దాంతో చెప్తా వాళ్ల సంగతి అని ప్రభావతి వెళ్తుంటే రోహిణి ఆపుతుంది.
రవికి పూలగంప చెఫ్‌గా సూచన
మీ గౌరవం నిలబడాలంటే ఆగండి అని రోహిణి చెబుతుంది. తీసుకొచ్చింది బాలు కదా. మీరు పంపించారంటే మళ్లీ తీసుకొస్తాడు. వాళ్లను బయటకు పంపించడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఇంట్లో ఎవరు లేకుంటే ఇంటికి వచ్చినవారు ఇబ్బందిగా ఫీల్ అయి వెళ్లిపోతారు. అందరూ వెళ్లాక నేనుండి వాళ్లతో మాట్లాడి పంపిస్తాను. ముందు మావయ్య మీరు బయటకు వెళ్లండి అని రోహిణి ఐడియా చెబుతుంది.
సత్యం దగ్గరికి వెళ్లి మనం బయటకు వెళ్దామని అంటే.. ఎక్కడికి అని అడుగుతాడు. మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే గుడికి వస్తానని మొక్కుకుందని రోహిణి చెబుతుంది. ఇంతలో బాలు వస్తే సత్యం గుడి విషయం చెబుతాడు. ట్రిప్ ఉంది. అయ్యాక వచ్చి తీసుకెళ్తా అని బాలు అంటే.. మనమే వెళ్దామని ప్రభావతి అంటుంది.
ఉన్నట్టుండి మొక్కు ఏంటీ. ఏదో తేడా కొడుతుందే అని బాలు అనుమానిస్తాడు. ప్రభావతి ఏదోటి అంటుంది. సరే గుడికి వెళ్లి త్వరగా జ్ఞానం రావాలని మొక్కుకో అని పైకి వెళ్లిపోతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
రోహిణి తన ప్లాన్‌లో సక్సెస్ అవుతుందా? మీనాపై బాలు అనుమానం నిజమవుతుందా? చింటు ప్రేమను రోహిణి ఎలా గెలుచుకుంటుంది? ఈ ఉత్కంఠ భరితమైన ఎపిసోడ్‌ను మిస్ అవ్వకుండా చూడండి.


