
📌 Key Points
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీ డేస్’ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా నిలిచింది.
- ప్రస్తుత జెన్ జీ యువతను దృష్టిలో ఉంచుకుని సీక్వెల్ కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
- హ్యాపీ డేస్ 2 స్క్రిప్ట్ పూర్తయిందని, త్వరలో నటీనటుల ఎంపిక ఉంటుందని సమాచారం.
- ‘కుబేర’ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్ 2’ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. జెన్ జీ ఆడియన్స్ కోసం ఆయన ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సక్సెస్
Happy Days 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్ గా అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో శేఖర్ కమ్ముల(Sekhar Kammula)ఒకరు. శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే చాలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఈయన సినిమాలు ఉంటాయని చెప్పాలి. ఆనంద్ ఒక మంచి కాఫీలాంటి సినిమాతో ఈయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హ్యాపీ డేస్(Happy Days) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ సినిమాని ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఫీలవుతుంటారు. 2007వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ హ్యాపీ డేస్ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇలాంటి బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండు అంటూ గత కొంతకాలంగా అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జెన్ జీ కోసం సీక్వెల్ కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల సైతం హ్యాపీడేస్ 2 (Happy Days 2)సినిమా చేయటానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ప్రస్తుత జెన్ జీ యువతను దృష్టిలో పెట్టుకొని ఈయన కాలేజీ నేపథ్యంలోనే సరికొత్త కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే హ్యాపీ డేస్ 2 సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందని ఇండస్ట్రీ సమాచారం. ఈ కథతో పాటు శేఖర్ కమ్ముల మరొక కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన కథను కూడా సిద్ధం చేశారట. ప్రస్తుతం ఈ రెండు స్క్రిప్టులతో ఈయన సిద్ధంగా ఉన్నారని త్వరలోనే నటీనటులు ఎంపిక పూర్తి అయితే ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాకు సంబంధించి ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ 2 చేయబోతున్నారనే వార్త అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాపీడేస్ తరహా సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
కుబేర తో సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్ముల..
స్క్రిప్ట్ పూర్తి.. త్వరలో నటీనటుల ఎంపిక!
ఇక హ్యాపీ డేస్ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, అప్పు వంటి తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఇలా నలుగురు స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగి మంచి విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల చివరిగా కుబేర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమాను ప్రకటించలేదు . త్వరలోనే హ్యాపీడేస్2 లేదా మరొక సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
మొత్తానికి, శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్ 2’ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి సినిమా తరహాలోనే విజయం సాధిస్తుందో లేదో చూడాలి.


