
📌 Key Points
- అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
- హైకోర్టు ఆదేశాలతో ఇవాళ జరగాల్సిన ప్రీమియర్ షోలు నిలిచిపోయాయి, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
- రూ.600 పెట్టి టికెట్లు కొన్న అభిమానుల రిఫండ్ పై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
- ఈ నిర్ణయం వల్ల డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు రూ.10 నుంచి 15 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అఖండ 2 సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఇవాళ్టి ప్రీమియర్ షోలు నిలిచిపోయాయి. ఈ పరిణామం చిత్ర బృందంతో పాటు అభిమానులను నిరాశపరిచింది.
హైకోర్టు సస్పెన్షన్: జీవో రద్దు, షోలు నిలిపివేత
High Court On Akhanda2: రిలీజ్ కు ముందు అఖండ 2 కు వరుస షాక్ లు తగులుతున్నాయి. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ సర్క్యూలర్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
అఖండ 2 మూవీకి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ప్రీమియర్స్ షో టికెట్ల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ప్రీమియర్స్ షోలకు టికెట్ ధర రూ.600, 12వ తేదీ నుంచి సింగిల్స్ స్క్రీన్స్ పై టికెట్ పై రూ.50, మల్టిప్లెక్స్‌లో టికెట్ పై 100 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు మూడు రోజులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. టికెట్ల రేట్లు పెంపు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
ఫ్యాన్స్‌లో ఆందోళన: టికెట్ల రిఫండ్ ప్రశ్నార్థకం
హైకోర్టు జీవో సస్పెన్సన్ తో నేడు ప్రీమియర్ షోలు ఆగిపోనున్నాయి. గురువారం సాయంత్రం 8గంటలకు ప్రత్యేక షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేయడంతో ఇవాల్టి షో రద్దు అయింది. ప్రీమియర్ షో రద్దుతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలయ్య అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. 600 రూపాయలు రిఫండ్ అవుతాయా లేదా అనేది ప్రశ్నార్ధకం మారింది.
దిల్ రాజుపై తీవ్ర ప్రభావం: భారీ నష్టం అంచనా
హైకోర్టు ఆదేశాలతో నిర్మాత / డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై ఎక్కువ ఎఫెక్ట్ పడనుంది. అఖండ 2 నైజాం రైట్స్ ను దిల్ రాజు రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఇప్పటికే 20 కోట్లు నిర్మాతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ల పెంపు జీవోను రద్దు చేయడంతో దిల్ రాజుపై ఎఫెక్ట్ పడనుందని విశ్లేషకులు అంటున్నారు. హై కోర్టు ఉత్వర్వుల వల్ల సినిమా కలెక్షన్స్ దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు అఖండ2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఉత్తర్వులతో అఖండ 2 ప్రీమియర్ షోలు ఆగిపోవడమే కాకుండా, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడటంతో సినిమా భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.


