|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్ లంచం స్కామ్! నర్మదపై వేదవతి దాడి! భాగ్యం దొంగతనం ప్లాన్!

Published: 08-07-2026, 8:07 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్ లంచం స్కామ్! నర్మదపై వేదవతి దాడి! భాగ్యం దొంగతనం ప్లాన్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అభిమానులకు షాకింగ్ న్యూస్! లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సాగర్ లంచం కేసు, నర్మదపై దాడి, భాగ్యం దొంగతనం ప్లాన్‌తో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం వేచి చూడండి!

Key Points

1

సాగర్‌కు లంచం అలవాటు చేసిన మామ ప్రసాద్ రావు, 10 వేలు చేతికిచ్చిన వైనం.

2

శ్రీవల్లి మంచితనంపై ధీరజ్‌కు అనుమానం, సుకన్య షాక్, వల్లి డ్యాన్స్ వెనుక ప్లాన్.

4

భాగ్యం 2 లక్షల చోరీకి మాస్టర్ ప్లాన్, ఇంటిల్లపాదిని ఆశ్చర్యపరిచే ట్విస్ట్.

సాగర్‌ను లంచాల ఊబిలోకి నెట్టిన మామ!

Illu Illalu Pillalu Serial June 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్‌లో సాగర్‌తో లేనిపోని మాటలు చెప్పి లంచం అలవాటు చేస్తాడు మామ ప్రసాద్ రావు. సంతకం పెట్టించుకుని 10 వేలు లంచం ఇప్పిస్తాడు. శ్రీవల్లి మంచితనంపై ధీరజ్‌కు డౌట్ వస్తుంది. ఆ మాటలు సుకన్య వింటుంది.

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో సక్సెస్‌ను ఎంజాయ్ చేయాలని డాక్టర్ మెరుపుతీగగా చేసిన క్లీనర్ అంటుంది. దాంతో డాక్టర్, శ్రీవల్లి డ్యాన్స్ చేస్తారు. భాగ్యం ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్ చేస్తుంది.

ఈ ఫైల్ మీద నీ సంతకం కోసం వచ్చాను. సంతకం చేయి అని ప్రసాద్ రావు అంటాడు. దాంతో అది ఏం చదవకుండానే ఫైల్ మీద సంతకం చేస్తాడు సాగర్. పక్కనున్న అతనికి ఫైల్ ఇచ్చి క్యాష్ తీసుకుని సాగర్‌కు ఇస్తాడు ప్రసాద్ రావు. డబ్బును డబ్బుతోనే కొనే రోజులు ఇవి. ఇప్పుడు నీ జేబులోని పెన్నుతో రెండు ఇంక్ చుక్కలతో సంతకం పెట్టగానే నీ జేబులో రూ. 10 వేలు ఉన్నాయి. జీతం నమ్ముకుంటే ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వలేవు అని ప్రసాద్ రావు అంటాడు.

నర్మదపై వేదవతి ఊహించని దాడి!

అలా సాగర్ లంచం తీసుకుని సంతకం పెట్టేలా, సాగర్‌కు లంచం అలవాటు అయ్యేలా చేస్తాడు మామ ప్రసాద్ రావు. తర్వాత ఆఫీస్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తానంటాడు సాగర్. మరోవైపు శ్రీవల్లి అబార్షన్, తన వైపు వల్లి మాట్లాడం గురించి ప్రేమ, నర్మద, ధీరజ్ మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుకన్య వింటుంది. వల్లి అలా శాంతమూర్తిలా మాట్లాడిందంటే దాని వెనుక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుందని ప్రేమ అంటుంది.

వల్లి వదినలో మార్పు రావడంలో మాయ మతలబు ఉందని ధీరజ్ అంటాడు. అంతకుమించి మీరు నన్ను కనిపెట్టగలరా ఏంటీ అని సుకన్య అంటుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందని ధీరజ్ అడిగితే.. ఆ అమ్మాయి కర్చీఫ్ కట్టుకుని వచ్చిందని నర్మద చెబుతుంది. నాకు తెలిసి ఈ ఏరియాలో లేడి డ్రైవర్లు ఎవరు లేరు. పైగా కర్చీఫ్ కట్టుకుందంటే తనను గుర్తు పట్టకూడదనే చేసిందని ధీరజ్ అంటాడు.

ఆ ఖిలాడీ డ్రైవర్‌ను పట్టుకుంటే వల్లి వదినలో వచ్చిన మార్పు ఏంటో తెలుస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో సుకన్య తెగ షాక్ అయిపోతుంది. కత్తి అటు ఇటు తిరిగి నావైపుకు వచ్చిందిరో అని ఇంట్లోకి పరిగెత్తుతుంది సుకన్య. వల్లి డ్యాన్స్ చేస్తుంటే భయంగా వెళ్లిన సుకన్య ధీరజ్ వాళ్లకు డౌట్ వచ్చిన విషయం చెబుతుంది. అసలు వాళ్లు ఆటో డ్రైవర్ గురించి ఆలోచించకుండా నేను చేస్తానుగా అని వల్లి అంటుంది.

భాగ్యం 2 లక్షల దొంగతనం ప్లాన్ వెనుక అసలు నిజం!

నర్మదను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది వల్లి. అది ఆపిన ప్రేమ హాస్పిటల్‌లో, ఇంటికొచ్చాకా బాగానే ఉన్నావ్. ఇందాకా ఏదో తింటూ కనబడ్డావ్. సడెన్‌గా ఏడుపు మొదలుపెట్టావని అడుగుతుంది. వేదవతి వారిస్తుంది. నన్ను ఇరికించే నువ్వు హాస్పిటల్‌లో నాకోసం అలా మాట్లాడటం చూసి చాలా ఆశ్చర్యమేసిందని నర్మద అంటుంది.

నా విషయంలో శాంతమూర్తిలా ఉన్నావంటే నిజంగా నీకు కడుపు ఉందా అని నర్మద అడుగుతుంది. దాంతో వేదవతి వచ్చి నర్మద చెంపచెల్లుమనిపిస్తుంది. అంతా షాక్ అవుతారు. సుకన్య, వల్లి నవ్వుతారు. తల్లికి బిడ్డ పోతే ఎలా ఉంటుందో తెలుసా. ఏంటీ నీ ఉద్దేశం. నీ వల్ల తన కడుపు పోయిందన్న బాధ, జాలి నీలో అస్సలు లేదు. అసలు నువ్వు మనిషివేనా అని నర్మదపై విరుచుకుపడుతుంది.

అంతా వెళ్లిపోతారు. మన మీద డౌట్ రాకుండా, ఆలోచించకుండా ఎట్టా రివర్స్ షాక్ ఇచ్చానో చూశావా అని సుక్కుతో అంటుంది వల్లి. మరోవైపు ఇడ్లీ బాబాయ్ బీపీ చెక్ చేసుకుని 180 వచ్చిందని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. భాగ్యం వచ్చి అడిగితే చాలా టెన్షన్‌గా ఉందని బీపీ వచ్చి పోయేలా ఉన్నానని అంటాడు.

ఈ పరిణామాలు ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఇంకెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.