
📌 Key Points
- రజనీకాంత్ ‘జైలర్ 2’ లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించబోతున్నారని లీక్.
- అగ్ర నటుడు మిథున్ చక్రవర్తి బెంగాలీ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
- మిథున్ చక్రవర్తి కూడా ‘జైలర్ 2’ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
- ‘జైలర్ 1’ భారీ విజయం తర్వాత, ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా పెరిగాయి.
రజనీకాంత్ అభిమానులకు గుడ్‌న్యూస్! ‘జైలర్ 2’ లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించబోతున్నారంటూ సంచలనాత్మక వార్త బయటపడింది. ఓ అగ్ర నటుడు ఇచ్చిన లీక్‌తో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం.
జైలర్ 2: రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కాంబోపై లీక్!
Shah Rukh Khan in Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది . ఆయన ఏ సినిమా చేసిన అది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది . రజనీ 173 వ చిత్రంపై బజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే . ఇంకా స్క్రిప్ట్ లేదు , ఈ మూవీ డైరెక్టర్ కూడా ఫిక్స్ కాలేదు . కానీ , కమల్ - రజనీ కాంబో అనగానే దేశవ్యాప్తంగా ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది . రజనీ ప్రస్తావన వస్తే చాలు ఈ మూవీ గురించి ఆరా తీస్తున్నారు . అలాంటిది ఇప్పుడు ఏకంగా రజనీతో బాలీవుడ్ బాద్ షా జతకట్టబోతున్నాడట .
దీనిపై తాజాగా ఓ అగ్ర నటుడు లీక్ ఇచ్చాడు . ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా హాట్ హాపిక్ అవుతుంది . ఇంతకి అసలు సంగతేంటంటే .. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 మూవీతో చేస్తున్నారు . స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది . జైలర్ 1 ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే . దీనికి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 ని నెల్సన్ అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు . ఇందులో ఇతర భాషలకు చెందిన స్టార్స్ కూడా భాగం కానున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది . కానీ , ఇప్పటి వరకు జైలర్ 2 కాస్ట్ ని మాత్రం నెల్సన్ రివీల్ చేయలేదు .
మిథున్ చక్రవర్తి ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎవరనేది ఇటూ ఇండస్ట్రీ వర్గాల్లో , అటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది . అయితే జైలర్ 2 బాలీవుడ్ అగ్ర నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే . తాజాగా ఆయన ఈ సినిమాలో ఓ స్టార్ కాస్ట్ పై లీక్ ఇచ్చారు . ఇటీవల ఓ బెంగాళీ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను నటిస్తోన్న ‘ జైలర్ 2′ మూవీ గురించి చెప్పారు . అదే క్యూరియాసిటీలో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నట్టు నోరు జారారు . అయితే ఇప్పటివరకూ ఈ సినిమా కాస్టింగ్ వివరాలను మూవీ టీం అధికారికంగా వెల్లడించలేదు. ఇక ఇప్పుడు షారుక్ జైలర్ 2 నటిస్తున్నాడంటూ మిథున్ చక్రవర్తి లీక్ ఇవ్వడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .
జైలర్ 2 పై అంచనాలు.. నెల్సన్ ప్రణాళికలు!
ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే స్క్రీన్ పై కనిపించడమంటే అభిమానులకు అదోక వేడుక . ఇప్పుడు రజనీకాంత్- షారూఖ్ ఖాన్ కాంబినేషన్ జైలర్ 2 లో కనిపిస్తుందని తెలిసి ఆడియన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు . వీరిద్దరి కలయిత జైలర్ 2 కి మరింత స్పెషల్ అవుతుందనడంలో సందేహం లేదు . కాగా ఈ ఇంటర్య్వూలో ఇటీవలి కాలంలో మీకు నచ్చిన సినిమా ఏదని ప్రశ్నించగా .. మిథున్ మాట్లాడుతూ.. ‘ జైలర్ 2 ‘ కథ అని చెప్పారు . ఈ మూవీ స్క్రిప్ట్ తనని బాగా ఆకర్షించిందన్నారు . అదే సమయంలో నటీనటుల వివరాల గురించి చెబుతూ.. మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణన్, శివరాజ్‌కుమార్ తదితరులు ఇందులో నటిస్తున్నారంటూ .. షారుక్ లీక్ ఇచ్చేసాడు . బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ పేరును అతడు లీక్ చేయడంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .
రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కలయికతో ‘జైలర్ 2’ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ లీక్ నిజమో కాదో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. అయితే ఈ వార్త ఇరు అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది.


