|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jayasudha: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్.. – జయసుధ

Published: 19-03-2026, 7:35 PM
Jayasudha: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్.. – జయసుధ
  • తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో జయసుధకు ఏఎన్నార్ అవార్డు లభించింది.
  • సీఎం రేవంత్ రెడ్డిని జయసుధ పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ లీడర్‌గా అభివర్ణించారు.
  • ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని, ఆయన నటనాసక్తిని జయసుధ గుర్తు చేసుకున్నారు.
  • సహ నటులను ఏఎన్నార్ గౌరవించే విధానాన్ని జయసుధ కొనియాడారు.

హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో జయసుధకు ఏఎన్నార్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ లీడర్‌గా అభివర్ణించారు. ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

జయసుధకు ఏఎన్నార్ అవార్డు ప్రదానం

Jayasudha: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (Telangana Gaddar Film Awards 2025) వేడుక గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డ్స్‌లో సహజనటి జయసుధ (Jayasudha)కు ఏఎన్నార్ అవార్డ్ (ANR Award) వరించింది. ఈ అవార్డ్ అందుకున్న అనంతరం ఆమె ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధం గురించి, అలాగే సీఎం రేవంత్ (CM Revanth Reddy) గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, దిల్ రాజు, ప్రియాంక.. ఈరోజు ఇక్కడకు విచ్చేసిన చిరంజీవి, కమల్ హాసన్ గార్లకు.. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా నమస్కారాలు. హ్యాపీ ఉగాది. ఇది నాకు దక్కిన చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. థాంక్యూ సీఎం సార్. ఏఎన్నార్ గారి గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు అంటే.. మా జనరేషన్‌లో ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది.

రేవంత్ రెడ్డిపై జయసుధ ప్రశంసలు

1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో రామానాయుడు గారి సినిమా ‘సెక్రటరీ’.. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్నార్ గారితో మొదలైంది. ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఆయనతో చేశాను. ఆయన ఎంత గొప్ప నటుడు అంటే.. అందరికీ తెలుసు, దాని గురించి నేను చెప్పడం కంటే.. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలి. సర్జరీ తర్వాత ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు.. ఆయన అన్నారు. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా.. నా స్టైల్‌లో ఏమన్నా నేను మార్చుకోవాలా? నా యాక్టింగ్‌లో నేను ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్‌లో ఏమైనా మార్పు రావాలా?’ అని.

అంత గొప్ప నటుడు.. అప్పటి ప్రజెంట్ జనరేషన్ కోసం తన యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఇండస్ట్రీలోకి అప్పుడే ఎంటర్ అయిన ఒక కొత్త నటుడిలా అడిగేవారు. సచ్ ఏ హ్యూమిలిటీ.. ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా అందరినీ అడిగేవారు. మమ్మల్ని కూడా అడిగేవారు.. ‘కరెక్ట్‌గా చేశానా? ఎక్కువ చేయలేదు కదా?’ అని. అంత గొప్ప నటుడు అంత సింపుల్‌గా ఉండడం మనందరం ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ నన్ను ‘మై లిటిల్ ఫ్రెండ్’ అని పిలిచేవారు. సో, ఐ వజ్ ఆల్వేస్ హిస్ లిటిల్ ఫ్రెండ్. ఐ యామ్ సో హ్యాపీ. ఆ లెగసీ కంటిన్యూ అవుతోంది.. నాగార్జున, సుశాంత్, సుమంత్ అండ్ అఖిల్.. అండ్ ఈరోజు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగచైతన్య.. ఏఎన్నార్ లివ్స్ ఆన్! థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్..’’ అని చెప్పుకొచ్చారు.

ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జయసుధ

అనంతరం సీఎం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంతకు ముందు నాకు చైర్‌పర్సన్‌ అవకాశం ఇచ్చారు.. థాంక్యూ. అండ్ ఈ సంవత్సరంలో నాకు ఏఎన్నార్ అవార్డ్ రావడం.. చాలా థాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్.. నేను శాసన సభ్యురాలుగా ఫస్ట్ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు, మా అసెంబ్లీలో సీఎం సార్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బట్ హి వజ్ ఏ డైనమిక్ స్పీకర్. నేనే ఎంతో ఆశ్చర్యపోయేదాన్ని. నేను అప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ ఉండింది కాబట్టి.. ఎన్నో సార్లు హౌస్ అడ్జర్న్ అయినప్పుడు ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు, ఆయనే వచ్చి నాతో మాట్లాడేవారు. ఈ విధివిధానాలు, అసెంబ్లీ గురించి చెప్పేవారు. ఐ యామ్ సో ప్రౌడ్ దట్ యు హావ్ బికమ్ చీఫ్ మినిస్టర్. నాట్ ఓన్లీ తెలంగాణ చీఫ్ మినిస్టర్.. యాన్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా’’ అని జయసుధ అన్నారు.

మొత్తానికి జయసుధ ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రేవంత్ రెడ్డిని ప్రశంసించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.