
📌 Key Points
- కల్కి 2 షూటింగ్ ను సైలెంట్ గా ప్రారంభించిన నాగ్ అశ్విన్.
- సుమతి పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం.
- షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న అమితాబ్ బచ్చన్.
- మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొనేను తొలగించారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాకు సీక్వెల్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ను నాగ్ అశ్విన్ సైలెంట్ గా మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ చేరుకున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైంది.
సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించిన నాగ్ అశ్విన్
Kalki part 2: ప్రభాస్ హీరోగా నాగ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పురాణ కథల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ సినిమాని కూడా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై ఎక్కడ అధికారకంగా స్పందించలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కల్కి సినిమా షూటింగ్ పనులను దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రారంభించినట్టు సమాచారం. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడానికి కంటే ముందుగా సినిమాలోని నటినటులకు బ్రీఫింగ్ ఇస్తున్నట్టు సమాచారం ఇప్పటికే సుమతి పాత్రలో సాయి పల్లవి లుక్ టెస్ట్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తుంది. మొదట ప్రభాస్ లేని సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్టు సమాచారం.. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్స్ లో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు మొదలయ్యాయనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక మొదటి భాగంలో సుమతి పాత్రలో దీపికా పదుకొనే నటించిన విషయం తెలిసిందే. ఇక రెండో భాగంలో కూడా ఈమె కొనసాగుతుందని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈమెను ఈ సినిమా నుంచి తప్పించారు. ఇలా దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో తదుపరి హీరోయిన్ ఎవరు అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
సుమతి పాత్రలో సాయి పల్లవి?
సుమతి పాత్రలో సాయి పల్లవి..
సుమతి పాత్ర కోసం అనుష్క, అలియా భట్, సాయి పల్లవి వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ సాయి పల్లవి సుమతి పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నారు. ఇక సుమతి పాత్రలో సాయి పల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించారని కల్కి టీం ఓ సందర్భంలో తెలియచేశారు. ఇక త్వరలోనే సాయి పల్లవి పాత్రకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని సమాచారం.
మొదటిసారి ప్రభాస్ జోడిగా సాయి పల్లవి?
హైదరాబాద్ చేరుకున్న అమితాబ్ బచ్చన్
ఇప్పటివరకు సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలతో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటివరకు టైర్ వన్ హీరోలతో నటించిన సందర్భాలు రాలేదు. మొదటిసారి ఈమె టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలిసిన సాయి పల్లవి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కూడా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
కల్కి 2 సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సాయి పల్లవి నటన ఎలా ఉండబోతుందో చూడాలి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


