|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

46 ఏళ్ల తర్వాత రజినీ, కమల్ కలయిక! ప్రోమో విడుదల.. స్టైలిష్ లుక్స్‌తో దుమ్మురేపే హీరోలు!

Published: 21-02-2026, 4:05 AM
46 ఏళ్ల తర్వాత రజినీ, కమల్ కలయిక! ప్రోమో విడుదల.. స్టైలిష్ లుక్స్‌తో దుమ్మురేపే హీరోలు!
  • రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా త్వరలో విడుదల కానుంది.
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
  • సినిమా ప్రోమోలో రజినీకాంత్, కమల్ హాసన్ స్టైలిష్ లుక్స్‌లో ఆకట్టుకుంటున్నారు.
  • 46 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించనుండటం విశేషం.

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇద్దరు హీరోలు స్టైలిష్ లుక్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

నాలుగు దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ!

KHxRK Promo: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది సినీప్రియలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీ స్టార్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న నటుడు రజినీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) మరోసారి ఒకే తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టార్ సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా రజనీకాంత్ కమల్ హాసన్ లుక్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ తమిళ ప్రోమో వీడియోలో భాగంగా రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ ఫోటో పోటీగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో హీరో ఎవరు అని వీరిద్దరూ అడగడం చాలా సరదాగా అనిపిస్తుంది. నెల్సన్ దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్తాన్ని రెడ్ జైంట్ మూవీస్ భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఓకే తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ రజనీకాంత్ తమ సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు .రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతోంది సమాచారం ఈ సినిమా పూర్తి అయిన తర్వాత తన 173 వ సినిమాని శిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించటం విశేషం.

స్టైలిష్ లుక్స్‌లో రజినీకాంత్, కమల్ హాసన్!

Born Cool. Built Retro. Eternal Swag. 😎 #KHxRK Tamil Promo

▶️ https://t.co/9rRSNvssoJ @ikamalhaasan @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @DirRajivMenon @Nirmalcuts @KiranDrk #PallaviSingh @amritharam2 @valentino_suren @alagiakoothan @MShenbagamoort3 @arjundurai … pic.twitter.com/qlUHR3FYrC

— Red Giant Movies (@RedGiantMovies_) February 21, 2026

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న సినిమా!

ఈ ప్రాజెక్టు పూర్తి అయిన అనంతరమే కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరోవైపు కమల్ హాసన్ కల్కి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టారని చెప్పాలి. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా అనే విషయం తెలియగానే అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మొత్తానికి, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.