
ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె తన యాంకరింగ్ కెరీర్ తొలినాళ్లలో నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చాక రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయనతో కలిసి ‘అన్నమయ్య’ సినిమాలో నటించడం తన కల నెరవేరిందని చెప్పారు.
Key Points
కస్తూరి శంకర్ కెరీర్ యాంకర్ గా ప్రారంభించి హీరోయిన్ అయ్యారు.
నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చాక రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదని తెలిపారు.
టీనేజ్ లో నాగార్జునతో కలిసినప్పుడు ఎంతో సంతోషపడ్డానని కస్తూరి తెలిపింది.
'అన్నమయ్య' సినిమాలో నాగార్జున పక్కనే హీరోయిన్ గా నటించడం తన కల నెరవేరిందని చెప్పింది.
కస్తూరి యాంకరింగ్ కెరీర్
Kasthuri Shankar : ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ బిజీగానే ఉంది. తన కెరీర్ ని యాంకర్ గా, న్యూస్ రీడర్ గా మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ మరింత వైరల్ అవుతుంది కస్తూరి శంకర్. తాజాగా కస్తూరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Kasthuri Shankar)
ఈ క్రమంలో కస్తూరి ఓ టాలీవుడ్ హీరో గురించి మాట్లాడింది.
నాగార్జునతో అనుభవం
కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. నేను యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టాను. కాలేజీలో చదివేటప్పుడే యాంకరింగ్ చేసేదాన్ని. మొదట్లో ఎక్కువగా కార్పొరేట్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఓ ఈవెంట్ లో నాగార్జున గారు పరిచయం అయ్యారు. అప్పటికే ఆయన చాలా మందికి ఫేవరేట్ హీరో. ఆ ఈవెంట్లో నాతో మాట్లాడారు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే నేను రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదు. నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని అందరికి చెప్పాను. మా క్లాస్ మేట్స్ అమ్మాయిలు జెలస్ ఫీల్ అయ్యారు. టీనేజ్ లో ఆ హ్యాపీనెస్ వేరు.
హీరో పక్కనే హీరోయిన్ గా
ఆ తర్వాత అన్నమయ్య సెట్ లో కలిసినప్పుడు, ఆ సినిమాలో నటించినప్పుడు నా కల నెరవేరింది అనిపించింది. ఆయన్ని కలిసి చాలా రోజులు అయింది. మళ్ళీ ఏదో ఒక సాకు చూసుకొని కలవాలి. మళ్ళీ నాగార్జున గారితో కలిసి పని చేయాలని ఉంది. అప్పట్లో మేము ఆయన్ని హీరోగా గొప్పగా చూస్తే ఇప్పటి జనరేషన్ విలన్ గా కూడా ఆయన్ని చూసి ఫిదా అవుతున్నారు అని తెలిపింది. ఇటీవల రజినీకాంత్ కూలి సినిమాలో నాగార్జున స్టైలిష్ విలన్ గా నటించి తమిళనాడులో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Also See : Komalee Prasad : అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
కస్తూరి శంకర్ నాగార్జునపై తన అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన పక్కనే హీరోయిన్ గా నటించాలన్న తన ఆకాంక్ష నెరవేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఆమె కోరుకుంటున్నారు.


