
📌 Key Points
- కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని కన్నుమూశారు.
- 84 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచారు.
- కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
- మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
అజిత్ తల్లి మోహిని కన్నుమూత
Kollywood : కొలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.. ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ కన్న తల్లి ఇవాళ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.. అజిత్ మోహిని వయసు 84 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈమె అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.. ఇవాళ ఉదయం ఆమె తన నివాసంలోనే స్వర్గస్తులయ్యారు. హీరో అజిత్ తల్లి మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సన్నిహితులు, బంధువులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.. కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి భారీగా ప్రముఖులు హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె అంత్యక్రియల గురించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..
వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస
సినీ ప్రముఖుల సంతాపం, అంత్యక్రియలు
అజిత్ తల్లి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. ఈ కష్ట సమయంలో అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


