|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి మాయాజాలం! వారణాసి కోసం మహేష్ బాబు రూపాంతరం!

Published: 04-02-2026, 5:05 AM
రాజమౌళి మాయాజాలం! వారణాసి కోసం మహేష్ బాబు రూపాంతరం!
  • రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన రన్నింగ్ స్టైల్‌ను మార్చుకున్నారు.
  • ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు పాత్రలో రాముడి ఛాయలు ఉండాలని రాజమౌళి భావించారు.
  • రెండు షాట్ల కోసం మహేష్ బాబు జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
  • యూరోపియన్ శిల్పాలను పరిశీలించి మహేష్ బాడీ లాంగ్వేజ్‌లో మార్పులు చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ చిత్రం కోసం తన రన్నింగ్ స్టైల్‌ను మార్చుకున్నారు. ఈ చిత్రం కోసం ఆయన జర్మనీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు రన్నింగ్ స్టైల్‌కు బ్రేక్ వేసిన రాజమౌళి

Varanasi:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)!స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. ముఖ్యంగా ఆయన పరిగెత్తే స్టైల్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘ఒక్కడు’ నుంచి ‘పోకిరి’ వరకు ఆయన రన్నింగ్ స్టైల్ ఎన్నో సినిమాలకు హైలైట్‌గా నిలిచింది. కానీ, ఇప్పుడు రాజమౌళి కోసం మహేష్ తన ఆ ‘సిగ్నేచర్ స్టైల్’ను సైతం మార్చుకోవాల్సి వచ్చింది. ‘వారణాసి’ చిత్రం కోసం జక్కన్న చేయించిన వర్క్‌షాప్స్, మహేష్ పడ్డ కష్టం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా మహేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన చెప్పిన విశేషాలు చూద్దాం..

తెలుగు సినిమాలో మహేష్ బాబు పరిగెత్తే విధానానికి ఒక బ్రాండ్ ఉంది. ‘అతడు’లో రైలు వెంట పరిగెత్తే సీన్ అయినా, ‘దూకుడు’లో విలన్లను వేటాడే రన్నింగ్ స్టైల్ అయినా,ఇక అతడు లో ఇంట్రవెల్ లో వచ్చే సీన్ లో అయనా ఆయన రన్నింగ్ స్టైల్ ప్రేక్షకులకు ఇప్పటికీ కళ్లముందే కదలాడుతుంది. అయితే ‘వారణాసి’లో మహేష్ పోషిస్తున్న పాత్రకు ఒక ప్రత్యేకమైన హుందాతనం, ఒక శిల్పం లాంటి భంగిమ అవసరమని రాజమౌళి భావించారు. ఈ పాత్రలో రాముడి ఛాయలు ఉండటంతో, నిలబడే విధానం నుంచి నడిచే స్టైల్ వరకు అన్నీ కొత్తగా ఉండాలని జక్కన్న కండిషన్ పెట్టారు. దీనికోసం మహేష్ తన పాత స్టైల్‌ను పక్కన పెట్టి, పూర్తిగా కొత్త బాడీ లాంగ్వేజ్‌ను అలవాటు చేసుకున్నట్టు, దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు మహేష్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

‘వారణాసి’ కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ

ఇక రాజమౌళికి సినిమాపై ఉన్న శ్రద్ధ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. సినిమాలో కేవలం రెండు షాట్ల కోసం మహేష్ బాబు పరిగెత్తే విధానాన్ని మార్చాలని ఆయన నిర్ణయించారు. దానికోసం మహేష్ 2024 నుంచి జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు కఠినమైన వర్క్‌షాప్స్‌లో పాల్గొని, పాత్రకు తగినట్టుగా నేర్చుకున్నారు.

రాజమౌళి పర్ఫెక్షన్ వెనుక మహేష్ కష్టం

యూరోపియన్ శిల్పాలను పరిశీలించి, వాటిలోని గ్రేస్ మహేష్ బాడీ లాంగ్వేజ్‌లో కనిపించేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, కేవలం రెండు షాట్ల కోసం ఇన్ని నెలల సమయాన్ని కేటాయించడం మహేష్ బాబుకు సినిమాపై ఉన్న అంకితభావాన్ని చాటిచెబుతోంది. ఇక రాజమౌళి సెట్స్‌లో ‘నైస్’ అనిపించుకోవడం ఎంత కష్టమో మహేష్ తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక్కోసారి పర్ఫెక్షన్ కోసం వందకు దగ్గరగా టేక్‌లు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఆయన తెలిపారు .

సూపర్ స్టార్ మహేష్ బాబు కష్టం, రాజమౌళి విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త మహేష్ బాబును చూడటానికి అభిమానులు 2027 ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే!

మొత్తానికి రాజమౌళి సినిమాలో పర్ఫెక్షన్ కోసం ఎంత కష్టపడతారో, దానికి మహేష్ బాబు ఎంత అంకితభావంతో సహకరిస్తారో ఈ సంఘటన తెలియజేస్తుంది. సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ ఫలిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.