
📌 Key Points
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ చిత్రం ఓవర్సీస్ హక్కులకు రూ.160 కోట్ల ఆఫర్ వచ్చింది.
- ఈ సినిమా హక్కుల ద్వారా అంత భారీ మొత్తం పొందిన తొలి భారతీయ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
- ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనుండగా, ప్రియాంకా చోప్రా మందాకినిగా నటిస్తున్నారు.
- ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు ఏకంగా రూ.160 కోట్ల ఆఫర్ వచ్చిందని సమాచారం.
‘వారణాసి’ చిత్రానికి భారీ ఆఫర్
Mahesh Babu: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ దర్శకుడు రాజమౌళి కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చిన్న సమాచారం వచ్చినా కూడా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కుల కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ.160 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. ఈ ఆఫర్ భారతీయ భాషలలో విడుదలయ్యే ఓవర్సీస్ రైట్స్ కోసం అని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై సినిమా టీమ్ ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ ఆఫర్‌పై నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ డీల్ నిజమైతే, ఓవర్సీస్ హక్కుల రూపంలో రూ.160 కోట్లు పొందిన తొలి భారతీయ సినిమాగా ‘వారణాసి’ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
రాముడిగా మహేష్ బాబు..విలన్ గా పృథ్వీరాజ్!
ఈ సినిమా కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతున్నారు. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా స్థాయి ఏమిటో ప్రేక్షకులకు చూపించారు. ఇది ఒక ఫాంటసీ – మైథలాజికల్ కథతో రూపొందుతున్న భారీ సినిమా.
ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మందాకిని అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు పెద్ద ప్లాన్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదల..రికార్డులు క్రియేట్!
‘వారణాసి’ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే, అత్యధిక దేశాల్లో విడుదలైన భారతీయ సినిమాగా కూడా ‘వారణాసి’ కొత్త రికార్డు సృష్టిం చే అవకాశం ఉంది.
మొత్తానికి ‘వారణాసి’ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


