
📌 Key Points
- నిహారిక విడాకులపై, పవన్ కళ్యాణ్ పై అనుదీప్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
- మెగా ఫ్యాన్స్ ‘ది స్ట్రీట్ కామెడీ క్లబ్’ వద్ద ఆందోళన చేపట్టారు.
- అభిమానుల ఆగ్రహంతో అనుదీప్ పరారీలో ఉన్నారు.
- వివాదం ముదరడంతో స్టాండప్ కామెడీ షోలను నిలిపివేశారు.
స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా నిహారిక విడాకుల గురించి, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో అనుదీప్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
అనుదీప్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
Tollywood:స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల జీవితాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల.ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ , అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అలాగే బాలకృష్ణ, నారా లోకేష్ పై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అటు టీడీపీ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్కడితో ఆగకుండా కొందరు ఫ్యాన్స్ అనుదీప్ షోలు నిర్వహించే “ది స్ట్రీట్ కామెడీ క్లబ్” వద్దకు వెళ్లి మరీ ఆందోళన చేపట్టారు.
అయితే ఆ సమయంలో అక్కడ వేరే కమెడియన్ షో చేస్తుండగా లోపలికి వెళ్ళి మరీ అనుదీప్ కోసం ఆరా తీశారు. అతను లేకపోవడంతో అనుదీప్ పై బూతులు తిడుతూ రెచ్చిపోయారు. బయటకొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక వివాదం కాస్త ముదరడంతో సోమాజిగూడ, జూబ్లీహిల్స్ , మాదాపూర్ వంటి ప్రాంతాలలోని స్టాండప్ కామెడీ సెంటర్ల నిర్వాహకులు కూడా వెంటనే అప్రమత్తమయ్యి షోలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇక అయితే అభిమానుల ఆగ్రహానికి గురైన అనుదీప్ దొరికితే ఎక్కడ ఏం చేస్తారో అనే భయంతో పరారీ అయ్యారు. ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పరారీలో ఉన్న అనుదీప్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
క్షమాపణలు చెప్పిన కమెడియన్ అనుదీప్
అయితే ఇప్పుడు దొరికితే చితక్కొట్టే రేంజ్ లో మెగా అభిమానులు ఆవేశంతో ఊగిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు అనుదీప్ కటికాల.. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని ఇలాంటి మాటలు అనడం ఎందుకు ? ఇప్పుడు భయంతో క్షమాపణలు చెప్పడం ఎందుకు? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కామెడీ అనేది ప్రేక్షకులను నవ్వించడం వరకు అయితే ఓకే కానీ హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలలోకి తొంగిచూసి వాటిని కించపరచడం బూతులు తిట్టడం కాదు. అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఇలా అడ్డదారిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం కొందరు చేసే ప్రయత్నాల వల్ల టాలెంట్ ఉన్న కమెడియన్లకు, మొత్తం స్టాండప్ రంగానికి చెడ్డపేరు వస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఏంటో పరిశీలించకుండా అసభ్యకర ప్రసంగాలు చేసే వారికి వేదికలు కల్పిస్తున్న సంస్థలు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఫేమ్ రావడానికి కష్టపడి తెలివితేటలను ఉపయోగించుకోవాలని.. అడ్డదారుల్లో ఇలా చేస్తే మాత్రం నిజంగా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు.
స్టాండప్ కామెడీ షోల నిలిపివేత
అనుదీప్ కటికాల క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ సంఘటన స్టాండప్ కామెడీలో హద్దులు, వ్యక్తిగత విమర్శల గురించి చర్చకు దారితీసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


