|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ హీరోల వల్ల బ్రేకప్! మృణాల్ ఠాకూర్ సంచలన నిజాలు!

Published: 19-02-2026, 6:35 AM
స్టార్ హీరోల వల్ల బ్రేకప్! మృణాల్ ఠాకూర్ సంచలన నిజాలు!
  • హీరోలతో కలిసి పనిచేయడం తన బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చలేదని మృణాల్ తెలిపింది.
  • అసూయతో బాయ్‌ఫ్రెండ్ తనను హీరోలతో పోల్చుకోవడం మొదలుపెట్టాడని ఆమె చెప్పింది.
  • బరువు తగ్గమని తాను ఎప్పుడూ తన బాయ్‌ఫ్రెండ్‌ను అడగలేదని మృణాల్ స్పష్టం చేసింది.
  • నమ్మకం లేకపోవడం వల్లనే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని మృణాల్ పేర్కొంది.

సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ తన బ్రేకప్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. స్టార్ హీరోల వల్ల తన బాయ్‌ఫ్రెండ్ అసూయ పడ్డాడని, అది బ్రేకప్‌కు దారితీసిందని తెలిపింది.

బాయ్‌ఫ్రెండ్ అసూయకు కారణం ఏమిటి?

Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న చిత్రం కూడా అమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అనుభవాన్ని షేర్ చేశారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మృణాల్ తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్న రోజుల గురించి మాట్లాడుతూ, అప్పట్లో తాను సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉండేదానని చెప్పారు. హీరోలతో కలిసి పనిచేయడం ఆమె వృత్తిలో భాగమే అయినా.. అది తన అప్పటి బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చలేదట. ఆమె సినిమా రంగంలో ఎదుగుతుండటం.. ప్రముఖ నటులతో కలిసి కనిపించడం అతనిలో అసూయను పెంచిందని మృణాల్ తెలిపింది.

మృణాల్ రిలేషన్‌షిప్ గురించి ఏం చెప్పింది?

ఆ అసూయ కారణంగా అతను తనను తాను హీరోలతో పోల్చుకోవడం మొదలుపెట్టాడట. తన లుక్ మీద ఎక్కువ దృష్టి పెట్టి జిమ్‌కి వెళ్లడం ప్రారంభించాడని చెప్పారు. రోజూ కష్టపడి వ్యాయామం చేసి..ఆహారంపై కంట్రోల్ పెట్టి సుమారు 15 కిలోల వరకు బరువు తగ్గాడట. తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవాలని ప్రయత్నించాడని మృణాల్ తెలిపింది.

కానీ ఈ మార్పు ఎక్కువకాలం నిలవలేదట. కొంతకాలం తర్వాత అతనికి ఆ డిసిప్లిన్ మీద ఆసక్తి తగ్గిపోయింది. జిమ్‌కు వెళ్లడం మానేసి, మళ్లీ సాధారణ జీవితం వైపు వెళ్లడంతో బరువు పెరిగిపోయాడట. అప్పుడు అతను తనతో, “ఇలా హీరోలతో పోల్చుకుంటూ ఉండడం నావల్ల కావట్లేదు” అని చెప్పినట్లు మృణాల్ గుర్తు చేసుకుంది.

సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్

ఈ అనుభవంపై స్పందిస్తూ మృణాల్.. తాను ఎప్పుడూ అతనిని బరువు తగ్గమని అడగలేదని, కండలు ఉన్నవాడినే ప్రేమించాలి అనే ఆలోచన తనకు లేదని చెప్పారు. ఇది పూర్తిగా అతనిలోని అసూయ వల్ల వచ్చిన ఒత్తిడే తప్ప, తన వల్ల కాదని ఆమె చెప్పుకొచ్చింది. “ ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోతే ఆ రిలేషన్‌షిప్ ఎక్కువకాలం నిలవలేదు. అందుకే కొద్దిరోజుల తర్వాత అతనితో బ్రేకప్ అయ్యింది,” అని తెలిపింది మృణాల్. ప్రస్తుతం మృణాల్ తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు.

మృణాల్ తన వ్యక్తిగత జీవితంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకుంది. నమ్మకం లేని సంబంధాలు ఎక్కువ కాలం నిలవలేవని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. ప్రస్తుతం ఆమె తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.