
📌 Key Points
- మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.
- సినిమా అవకాశాల కోసం దర్శకులను సిగ్గు లేకుండా అడిగానన్న మృణాల్.
- అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ సినిమాలో నటించనున్న మృణాల్.
- కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపిన మృణాల్ ఠాకూర్.
మృణాల్ ఠాకూర్ ఒకప్పుడు అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించానని, సిగ్గు విడిచి అందరినీ అడిగానని తెలిపింది. ఆమె త్వరలో అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ సినిమాలో నటించనుంది. ఈ సందర్భంగా తన కెరీర్ ఆరంభంలోని కష్టాలను గుర్తు చేసుకుంది.
మృణాల్ ఠాకూర్ సినీ ప్రస్థానం
Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోను అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మృణాళ్ ఠాకూర్ తన కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ తన ఇబ్బందుల గురించి తెలియజేశారు. మృణాళ్ ఠాకూర్ కెరీర్ లో టీవీ సీరియల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇలా మరాఠీ సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకున్నారు.
సినిమాలపై ఆసక్తితో తాను అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. నాకు సినిమా అవకాశాలు కల్పించమని నేను మొదటిసారి కలిసిన దర్శకుడు ఆదిత్యధర్. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు నాకు చాలా తేలికగా రాలేదు అవకాశాలను మనమే సృష్టించుకోవాలని మృణాళ్ ఠాకూర్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావాలి అంటే డైరెక్టర్లు నా ఫేస్ చూసేలా చేసుకోవాలి.
అవకాశాల కోసం ఎదురుచూపులు
ఇలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడం కోసం ఇలాంటి పనులను చేయటానికి నేను ఏ మాత్రం సిగ్గుపడనని తెలిపారు. నటనపై నాకున్న ఆసక్తితో సిగ్గు లేకుండా అందరిని అవకాశాలు అడిగేదాన్ని అంటూ మృణాళ్ ఠాకూర్ ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎంతోమంది డైరెక్టర్ల వద్దకు వెళ్లి తానే స్వయంగా అవకాశాలు ఇవ్వాలి అంటూ అడిగానని, ఇలా కష్టాలను అధిగమిస్తూ సినిమా అవకాశాలను అందుకొని తనని తాను నిరూపించుకున్నానని తెలిపారు. ఇలా బాలీవుడ్ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు..
విడుదలకు సిద్ధమైన డెకాయిట్..
‘డెకాయిట్’ సినిమాతో మృణాల్
ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ పలు బాలీవుడ్, టాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుని వరుస షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె త్వరలోనే అడవి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ (Decoit)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఇక మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు కానీ అదే రోజు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడుతూ ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు మంచి అంచనాలను పెంచేశాయి.
మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన కష్టాల గురించి చెప్పడం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. త్వరలో ఆమె ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.


