
📌 Key Points
- నాని ‘బ్లడీ రోమియో’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
- ఈ చిత్రంలో నాని చెఫ్, గ్యాంగ్‌స్టర్ పాత్రలలో కనిపించనున్నారు.
- సినిమాలోని విభిన్న భావోద్వేగాల కోసం ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేయనున్నారు.
- నాని కెరీర్‌లో ఒకే సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం ఇదే తొలిసారి.
నేచురల్ స్టార్ నాని హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. ఈ సినిమా కోసం దర్శకుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సినిమాలోని పాటల కోసం ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోనున్నారు.
బ్లడీ రోమియోలో నాని పాత్ర
Nani Bloody Romeo:నేచురల్ స్టార్ నాని(Nani ) ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈలోపు ఆయన తన బర్త్డే సందర్భంగా మరో సినిమాను ప్రకటించారు. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అంటూ ఒక చిన్న టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఊహించని అంచనాలు పెంచేశారు సుజీత్. స్టైలిష్ టేకింగ్ తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. ఇకపోతే ఇందులో చెఫ్ అలాగే గ్యాంగ్స్టర్ పాత్రలో నాని నటిస్తున్నట్లు సుజీత్ రివీల్ చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజీత్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఒక సరికొత్త ప్రయోగానికి తెర లేపుతున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఒక చిత్రానికి ఒక సంగీత దర్శకుడు మాత్రమే ఉంటారు. కానీ నాని బ్లడీ రోమియో కోసం మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్ లతో పని చేయించాలని డైరెక్టర్ సుజీత్ భావిస్తున్నారట. ముఖ్యంగా కథలోని విభిన్న షేడ్స్ ,ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఇద్దరు లేదా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను ఆయన రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది.
సుజీత్ మాస్టర్ ప్లాన్ ఏమిటి?
ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ , డ్రామా కలగలిసి ఉంటాయని.. అందుకే ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ ని రంగంలోకి దింపాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఒకరు, పాటలకు ఒకరు, డిఫరెంట్ జానెర్ సాంగ్స్ కోసం ఇంకొకరు ఇలా వేర్వేరు ట్యూన్స్ కి మేకర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా నాని సినిమాలలో సంగీతానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇలా ఒకే సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం అనేది నాని కెరియర్ లోనే ఇదొక విశేషంగా నిలవబోతోంది అని చెప్పవచ్చు. సినిమాలలో మ్యూజిక్ అలాగే సౌండ్ డిజైనింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్ల కాన్సెప్ట్ ను సినిమాకి పెద్ద ప్లస్ అయ్యేలా చేయాలని సుజిత్ భావిస్తున్నారట . ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సుజీత్, నాని కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ముగ్గురు సంగీత దర్శకుల ఎంపిక వెనుక కారణం
నాని తదుపరి చిత్రాల విషయానికి వస్తే బ్లడీ రోమియోతో పాటు హిట్ : ది ఫోర్త్ కేసులో తన సొంత నిర్మాణంలోనే ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ మరింత బిజీగా మారిపోయారు నాని.
మొత్తానికి నాని కెరీర్‌లో ‘బ్లడీ రోమియో’ ఒక ప్రత్యేక చిత్రంగా నిలవనుంది. ముగ్గురు సంగీత దర్శకులతో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


