|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్న చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించిన ‘నిలవే’ మూవీ! కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది!

Published: 18-02-2026, 3:35 AM
చిన్న చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించిన 'నిలవే' మూవీ! కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది!
  • సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం ‘నిలవే’.
  • ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.
  • దర్శకుడు వి. సముద్ర చిత్ర యూనిట్‌ను అభినందించారు.
  • సౌమిత్ ఈ సినిమా తమకు ‘బాహుబలి’ లాంటిదని పేర్కొన్నారు.

సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ‘నిలవే’ చిత్రం ఫిబ్రవరి 13న విడుదలైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిత్ర యూనిట్‌ను అభినందించారు.

విడుదలైన ‘నిలవే’ మూవీ, ప్రేక్షకుల ఆదరణ

Nilave Movie: సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు.

Read also- Siddu Rambo: సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే.. మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లోగింగ్..

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం గారితోపాటు టీమ్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నా”అని అన్నారు.

చిత్ర యూనిట్‌ను అభినందించిన దర్శకులు

మరో అతిథిగా హాజరైన జెమిని సురేష్​ మాట్లాడుతూ..‘‘ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగింది. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్‌ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన రాజ్ అల్లాడ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సాయి విజన్, దిలీప్ విజువల్స్‌, కళ్యాణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయి. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు”అని అన్నారు.

Read also- Star Director Vs Star Hero : వివాదంలో స్టార్ హీరో..బడా డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!

‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది: హీరో సౌమిత్

హీరో సౌమిత్ మాట్లాడుతూ ..‘‘కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి గారు కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ”అని అన్నారు.

దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..‘‘మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నాను. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. మా కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇక్కడవరకు వచ్చాం. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్‌ వచ్చింది”అని అన్నారు.

మొత్తానికి నిలవే చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త నటీనటులను ప్రోత్సహించడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.