
📌 Key Points
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ మూవీ కోసం ఎదురుచూపులు.
- మే 19న టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
- సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం.
- జార్దాన్‌లో షూటింగ్, రుక్మిణి వసంత్ హీరోయిన్, టోవినో థామస్ కీలక పాత్ర.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా టీజర్ విడుదల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 19న టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనితో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
మే 19న ‘డ్రాగన్’ టీజర్ విడుదల?
NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టీజర్‌ను మే 19వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఏదో ఒక భారీ అప్‌డేట్ రావడం ఆనవాయితీ. అయితే, ఈసారి ఒక రోజు ముందుగానే అంటే మే 19వ తేదీ సాయంత్రం ఈ టీజర్‌ను రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనివల్ల బర్త్‌డే రోజున ట్రెండింగ్ ఒక రేంజ్‌లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
Read also- Allu Arjun: పుష్ప తరువాత నిజంగానే అల్లు అర్జున్ వ్యవహార తీరి మారిందా.. గతంలో కూడా ఇంతే.. ఇదే క్లారిటీ..!
‘డ్రాగన్’ టైటిల్‌పై అభిమానుల అంచనాలు
ఈ సినిమాకు ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాత రవిశంకర్ ఒక సందర్భంలో ఈ టైటిల్‌ను ప్రస్తావించడంతో అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్‌కు తగ్గట్టుగా ఈ టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీజర్ లోనే అధికారిక టైటిల్ ప్రకటన కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్దాన్ వంటి విదేశీ లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Read also- Ashika Ranganath : చూపులతో చంపేస్తున్న ఆషిక.. ఇలా అయితే కుర్రాళ్లకు కష్టమే..
జార్డాన్‌లో షూటింగ్, తారాగణం వివరాలు
మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 25, 2026న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేశారు. మొత్తానికి ‘సలార్’, ‘KGF’ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన నీల్, ‘RRR’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మే 19న రాబోయే ఈ టీజర్ భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ఫుల్ లుక్ లో ఎన్టీఆర్ ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి.
మొత్తానికి ‘సలార్’, ‘KGF’ చిత్రాలతో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


