
ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాపై నిర్మాత నాగవంశీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
నాగవంశీ ఇచ్చిన ఆసక్తికర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
త్రివిక్రమ్ మొదటిసారి మైథాలాజికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించాలని నాగవంశీ ఆశ.
వచ్చే ఏడాది మధ్యలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో రాబోతుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఇందులో నటీనటులు ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయంపై ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ (Naga Vamsi)ఆసక్తికర కామెంట్స్ చేసి హైప్ పెంచేశారు. ‘‘మా సినిమాను ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్నాం.
త్రివిక్రమ్ మొదటిసారి మైథాలాజికల్ సినిమా తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను నేను అలా దేవుడిగా చూపించబోతున్నాను. ‘రామాయణ’ సినిమాను ప్రకటించిన తర్వాత దేశమంతా దాన్ని మాట్లాడుకుంటున్నారు. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజుల ఆపాం. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే.. త్రివిక్రమ్-వెంకటేష్ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ పనులు మొదలుపెడతాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా విశేషాలు
సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడు?
నాగవంశీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


