
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం నుండి మూడో సాంగ్ ప్రోమో విడుదల.
- శ్రుతి హాసన్, రామ్ చరణ్ ల ఊర మాస్ స్టెప్పులతో ప్రోమో వైరల్.
- భోపాల్‌లోని ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌లో పూర్తి పాట విడుదల.
- పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుంచి ఊర మాస్ ఐటెం సాంగ్ ప్రోమో విడుదలైంది. శ్రుతి హాసన్‌తో కలిసి చరణ్ చేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట పూర్తి వెర్షన్‌ను ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌లో విడుదల చేయనున్నారు.
“పెద్ది” ఐటెం సాంగ్ ప్రోమో విడుదల
Peddi Song Promo: వచ్చేసింది..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుండి మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.ఇప్పటికే చికిరి, రై రై అంటూ రెండు సాంగ్స్ ని వదిలిన మేకర్స్ ముచ్చటగా మూడో సాంగ్ ప్రోమోని వదిలారు.అది కూడా హాట్ బాంబ్ శృతి హసన్ తో చేసిన స్పెషల్ సాంగ్ ది కావడం విశేషం. చీర.. చొక్క.. చిక్కెడిపోవాలో..”అంటూ మొదలైన ఈ సాంగ్ లో చరణ్ తన సిగ్నేచర్ స్టెప్స్, గ్రేస్‌తో ఊగిపోతుంటే, శ్రుతి హాసన్ తన గ్లామర్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసింది. కేవలం కొన్ని సెకన్ల ప్రోమోనే సోషల్ మీడియాను కుదిపేస్తుంటే, ఇక పూర్తి పాట ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుండే థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
భోపాల్ ఈవెంట్లో పుల్ సాంగ్ వెర్షన్
ఇక ఈ స్పెషల్ సాంగ్ ఫుల్ వెర్షన్‌ను రేపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్రాండ్‌గా జరగనున్న ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారట. రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ మధ్యలో ఈ పాటను రిలీజ్ చేస్తుండటంతో నేషనల్ వైడ్‌గా ఈ ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయ్. ఇక ఈ చిత్రానికి రెహమాన్ అందిస్తున్న ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్ళే ఛాన్స్ పుష్కలంగా ఉందని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ మళ్లీ పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందా అన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది.
ఏ.ఆర్. రెహమాన్ కాన్సర్ట్‌లో పూర్తి పాట
అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని టాక్
ఇకపోతే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తోంది. ‘దేవర’తో తెలుగు ఆడియన్స్ దగ్గరైన ఈ అమ్మడు,ఇపుడు చరణ్ పక్కన నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్‌గా ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోగా, ఇప్పుడు వారి వారసులుగా చరణ్, జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కమ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని ఇన్ సైడ్ వినిపిస్తున్న టాక్.
చరణ్, జాన్వీల అద్భుతమైన కాంబినేషన్
ఆ చేదు జ్ఞాపకాలని ఈ పెద్ది ఎలా మరిపిస్తాడా ?
ఇక RRR,గేమ్ ఛేంజర్ సినిమాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమా మార్కెట్ ఓపెన్ అయింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వరల్డ్ వైడ్ గా జూన్ 4న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న సంగతి తెల్సిందే. ఈ లోపే ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మేకర్స్, ఈ ఐటెం సాంగ్‌తోనే బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయాలని పెద్ద ప్లానే వేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఇప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ కరువును తీరుస్తూ వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక భోపాల్ కాన్సర్ట్ తర్వాత ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్, ట్రైలర్ రిలీజ్ డేట్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రకటించడానికి రెడీ అవుతున్నారట మేకర్స్.చూడాలి మరి గేమ్ చేంజర్ మిగిల్చిన ఆ చేదు జ్ఞాపకాలని ఈ పెద్ది ఎలా మరిపిస్తాడో !
‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఐటెం సాంగ్ ప్రోమో సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


