
📌 Key Points
- రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కావాల్సిన ‘పెద్ది’ వాయిదా.
- ఏప్రిల్ 30న విడుదలవుతుందని రామ్ చరణ్ చెప్పినా, మళ్ళీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
- హనుమాన్ జయంతి పోస్టర్ లో విడుదల తేదీ లేకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమవుతోందని సమాచారం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఏప్రిల్ 30న విడుదల కావల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.
పెద్ది సినిమా విడుదల వాయిదాకు కారణాలు
Peddi Movie:రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారిన చిత్రం పెద్ది. అందుకే ఈ సినిమాను చాలా పర్ఫెక్షనిజంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం చేస్తున్న కసరత్తులు అందరిని ఆశ్చర్యపరుస్తుంటే.. అభిమానులను మాత్రం విసుగు తెప్పిస్తున్నాయి అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2026 మార్చి 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.
పైగా తెలంగాణలో తీసుకొచ్చిన టికెట్ ధరల పెంపును కారణంగా చూపించి.. ఏప్రిల్ 30వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యేది కష్టమే అనే కామెంట్లు వ్యక్తమయ్యాయి. కానీ ఈ చిత్ర హీరో రామ్ చరణ్.. తన సోదరీ నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన రాకాస సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన కచ్చితంగా వస్తుంది అని స్పష్టం చేశారు. దీంతో ఏప్రిల్ 30న పెద్ది సినిమాను థియేటర్లలో చూడాలని, అభిమానులు ఎంతో ఎక్సైట్ గా ఎదురు చూడగా .. కానీ ఇప్పుడు తాజాగా పెద్ది విడుదల తేదీ పై నీలి నీడలు కమ్ముకోవడం చూసి అభిమానులలో సందిగ్ధత ఏర్పడింది.. పైగా నిర్మాతల మైండ్ గేమ్ చూసి విసిగిపోతున్నారు.
రామ్ చరణ్ మాట తప్పారా?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఏప్రిల్ 30న రావాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడడానికి కారణం ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా పహిల్వాన్ లుక్కులో రామ్ చరణ్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడమే .. అందులో రిలీజ్ డేట్ లేకపోవడంతోనే ఇప్పుడు ట్రేడ్ వర్గాలలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అటు ఓవర్సీస్ పంపిణీదారులు కూడా మరో వారంలోగా స్పష్టత వస్తేనే ఆన్లైన్ బుకింగ్ సజావుగా సాగుతాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది
అయితే తాజాగా ఈ ఆలస్యానికి కారణం సాంకేతిక నిపుణుల పర్ఫెక్షనిజం అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా అటు సంగీతం, బీజీఎం విషయంలో రాజీ పడకుండా సమయం తీసుకుని మరీ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. బుచ్చిబాబు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై తీవ్రమైన కసురత్తులు చేస్తున్నారు. అంతేకాదు ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని కీలకమైన పనులు కూడా పెండింగ్లో ఉండడంతోనే సినిమాను పర్ఫెక్ట్ గా ప్రేక్షకులకు అందించడం కోసం ఇప్పుడు వాయిదా వేసినట్లు సమాచారం.
అభిమానుల్లో పెరుగుతున్న నిరాశ
ఇకపోతే ఏప్రిల్ 30న ఈ సినిమా వాయిదా పడితే.. మరెప్పుడు తెరపైకి వస్తుంది అనే ప్రశ్నలు ఇండస్ట్రీ నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా జూన్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 25వ తేదీ ప్రీమియర్ షో వెయ్యనున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఏది ఏమైనా వరుసగా వాయిదా పడుతూ వస్తుంటే అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కనీసం జూన్ 26వ తేదీనైనా ఈ సినిమా వస్తుందా అనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం . మరి చిత్ర బృందం ఎప్పుడు ఈ సందిగ్ధతకు తెర లేపుతుందో చూడాలి.
ఏది ఏమైనా, పెద్ది సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత వీడాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే చిత్ర బృందం స్పష్టతనిస్తుందని ఆశిద్దాం.


