|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ పెళ్లిపై ఊహించని ప్రకటన! లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 12-04-2026, 1:35 PM
ప్రభాస్ పెళ్లిపై ఊహించని ప్రకటన! లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్!
  • ప్రభాస్ త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు.
  • అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
  • ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
  • ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ ఇటీవల తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గత ఏడాది ఎంతో మంది హీరోలు పెళ్లి చేసుకుని పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టగా ఈ ఏడాది మొదట్లోనే అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ వంటి వాళ్ల పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇలా ఎంతోమంది హీరోలు పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ మాత్రమే ఇప్పటివరకు పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. పలు సందర్భాలలో ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆయన మాత్రం త్వరలోనే చేసుకుంటానని చెబుతున్నారు తప్ప ఇప్పటివరకు శుభవార్త మాత్రం తెలియచేయలేదు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవడంతో ఈయన చెప్పిన సమాధానం విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా లేదా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికర సమాధానం చెప్పారు. పెళ్లి విషయంలో లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అంటే కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఈయన కామెంట్లు చేయడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రభాస్ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ప్రతిసారి నిరాశ ఎదురవడంతో ఇక ఈయన పెళ్లి చేసుకోరని ఫిక్స్ అయ్యారు. ఇలాంటి తరుణంలోని ఈయన పెళ్లి గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఏకంగా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నానని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న ప్రభాస్

ఇక ఈయన లవ్ చేసిన అమ్మాయి ఎవరు అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేయగా? తను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా లవ్ చేసి చేసుకుంటానని చెప్పారా? అంటూ మరి కొంతమంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ ఏడాదిలోనే ఫౌజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు స్పిరిట్ సినిమా అలాగే కల్కి 2 సినిమాల షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

https://x.com/ChotaNewsApp/status/2043309986131124667

సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్

ప్రభాస్ లవ్ మ్యారేజ్ ప్రకటన ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తన సినిమా కెరీర్‌తో బిజీగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.