|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లి అంత్యక్రియలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు! నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై!

Published: 02-04-2026, 5:05 AM
తల్లి అంత్యక్రియలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు! నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై!
  • ప్రకాష్ రాజ్ తల్లి క్రిస్టియన్ కావడంతో ఆమె నమ్మకాలకు గౌరవం ఇచ్చి క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు.
  • దేవుడిని నమ్మని మీరు మతపరమైన పద్ధతుల్లో ఎలా అంత్యక్రియలు చేస్తారని నెటిజన్ ప్రశ్నించారు.
  • నమ్మకం వ్యక్తిగతం, గౌరవం సామాజికం అని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు.
  • ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రకాష్ రాజ్ తన తల్లి మరణానంతరం క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించడంపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు భావోద్వేగంతో సమాధానమిచ్చారు. తన తల్లి నమ్మకాలను గౌరవించానని ఆయన తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానం

Prakash Raj: నాస్తికుడినైనా తల్లి నమ్మకాలకు గౌరవం ఇచ్చి క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించానని ప్రకాష్ రాజ్ స్పందన నెట్టింట వైరల్.వైవిధ్యభరిత నటనతోనే కాకుండా, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ అందరికీ సుపరిచితులే. ఇటీవల ఆయన తల్లి మరణించిన సమయంలో, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. తాను నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్, ఇలా ఎందుకు చేశారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా, ఆయన ఎంతో హుందాగా సమాధానమిచ్చారు.

Read also- ‘హనుమాన్ జయంతి’ రోజున చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

ప్రకాష్ రాజ్ తల్లి క్రిస్టియన్ మతానికి చెందినవారు. ఆమె మరణించిన తర్వాత, ఆమె నమ్మకాలకు గౌరవం ఇస్తూ క్రైస్తవ పద్ధతిలోనే అంతిమ వీడ్కోలు పలికారు. అయితే, ప్రకాష్ రాజ్ నిత్యం హేతువాద దృక్పథంతో మాట్లాడుతూ, దేవుడిపై తనకు నమ్మకం లేదని చెబుతుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక నెటిజన్.. “దేవుడిని నమ్మని మీరు, మతపరమైన పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు ఎలా చేస్తారు?” అని ప్రశ్నించారు.

క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు ఎందుకు?

ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మానవత్వం పరస్పర గౌరవం గురించి గొప్ప వివరణ ఇచ్చారు. “అవును, నాకు దేవుడిపై నమ్మకం లేదు.. కానీ మా అమ్మ తన దేవుడిని బలంగా నమ్మేవారు. ఆమె నమ్మకాల ప్రకారం అంతిమ సంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేను ఎవరిని? మనం ఒకరికొకరు ఇచ్చుకునే ప్రాథమిక గౌరవం ఇదే. ద్వేషాన్ని నింపే మనుషులకు ఈ విషయం అర్థమవుతుందా?” అని ఆయన ప్రశ్నించారు.

Read also- రేపు థియేటర్లో విడుదయ్యే సినిమాల లిస్ట్ ఇదే.. చూసేయండి మరి..

వ్యక్తిగత అభిప్రాయాలు వేరైనా, మనకు అత్యంత ప్రియమైన వారి నమ్మకాలను గౌరవించడం అనేది కనీస ధర్మమని ప్రకాష్ రాజ్ తన సమాధానం ద్వారా స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి తన అంతిమ యాత్ర ఏ పద్ధతిలో జరగాలి అనే హక్కు ఉంటుందని, దాన్ని నెరవేర్చడం కుమారుడిగా తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “నమ్మకం అనేది వ్యక్తిగతం, కానీ గౌరవం అనేది సామాజికం” అంటూ ఆయన అనుసరించిన తీరును పలువురు సమర్థిస్తున్నారు.

వైరల్ అవుతున్న ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

Yes. I don’t believe in god .. but my mother believed in her god . Who am i to deny her .. the right to be buried according to her belief. This is the basic respect we give one another. Will you Hate mongering monsters understand this #justasking https://t.co/vD1GhySf3M

— Prakash Raj (@prakashraaj) April 2, 2026

ప్రకాష్ రాజ్ తన తల్లి నమ్మకాలకు గౌరవం ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా మానవత్వం, పరస్పర గౌరవం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆయన సమాధానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.