
📌 Key Points
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదని దర్శకుడు స్పష్టం చేశారు.
- ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది.
- జై హనుమాన్ సినిమా షూటింగ్ హంపిలో ఈనెల 22న ప్రారంభం కానుంది.
- ప్రభాస్ స్పిరిట్, కల్కి 2 సినిమాల తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా ఉండవచ్చు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా ఆగిపోయిందనే వార్తలకు చెక్ పెట్టారు. ఈ సినిమా తప్పకుండా ఉంటుందని, ప్రభాస్ ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఆలస్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభాస్ సినిమాపై ప్రశాంత్ వర్మ ప్రకటన
Prashanth Varma: ప్రశాంత్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. జాంబిరెడ్డి హనుమాన్ వంటి సినిమాల ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన తన సినిమాల విషయంలో కూడా కాస్త విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాని ఈనెల 22వ తేదీ హంపిలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని చిత్ర బృందం తెలియచేశారు.
జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ భాగమవుతారా లేదా అనే విషయం తెలియదు కానీ ఇందులో హనుమంతుడు పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పనులు త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) తో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందని, వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అభిమానులు అయోమయ పరిస్థితిలలో ఉన్నారు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే
ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. కచ్చితంగా ప్రభాస్ తో సినిమా ఉంటుందని అయితే ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ ,కల్కి 2 సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే మా ఇద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇలా ప్రభాస్ షెడ్యూల్ కారణంగానే సినిమా ఆలస్యం అవుతుందే తప్ప సినిమా ఆగిపోలేదు అంటూ ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ప్రభాస్..
జై హనుమాన్ షూటింగ్ అప్డేట్స్
ఇలా ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి జోనర్ లో సినిమా రాబోతోంది అనే విషయాలు తెలియాల్సి ఉంది ఇక ప్రభాస్ ప్రస్తుతం హనురాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌజి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి సినిమా పనులలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలో షూటింగ్ పనులలో ప్రభాస్ ఏంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక శుభవార్త. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఆశిద్దాం. వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.


