|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..

Published: 10-10-2025, 10:24 AM
ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిర్మాతగా ఓటీటీలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రైమ్ వీడియోతో కలిసి ‘స్టార్మ్’ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మలయాళ నటి పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది.

Key Points

1

హృతిక్ రోషన్ 'స్టార్మ్' వెబ్ సిరీస్‌తో నిర్మాతగా ఓటీటీలోకి అరంగేట్రం చేస్తున్నాడు.

2

ముంబై నేపథ్యంలో రూపొందే ఈ థ్రిల్లర్ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

4

అజిత్‌పాల్ సింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.

హృతిక్ రోషన్ ఓటీటీ నిర్మాతగా అరంగేట్రం

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓటీటీలోకి నిర్మాతగా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ముంబై నేపథ్యంలో రూపొందే ‘స్టార్మ్’ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం హృతిక్.. ప్రైమ్ వీడియో తో కలిసి పనిచేస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 10) అనౌన్స్ చేశాడు. ఇది హృతిక్ రోషన్, అతని బ్యానర్ అయిన హెచ్‌ఆర్ఎక్స్ ఫిల్మ్స్ మధ్య సహకారంతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్.

వెబ్ సిరీస్ వివరాలు ఇవీ..

అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి రానున్న ఈ వెబ్ సిరీస్‌ను అజిత్‌పాల్ సింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు. కథను అజిత్‌పాల్ సింగ్, ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ రాశారు. ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతుతోపాటు అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘స్టార్మ్’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇది ముంబై నేపథ్యంలో సాగే ఒక హై-స్టేక్స్ థ్రిల్లర్ డ్రామాగా చెబుతున్నారు.

‘స్టార్మ్’ వెబ్ సిరీస్ వివరాలు

ఓటీటీలోకి నిర్మాతగా అడుగుపెడుతున్న హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. “స్ట్రీమింగ్ రంగంలో నిర్మాతగా నా అరంగేట్రానికి ‘స్టార్మ్’ నాకు సరైన అవకాశాన్ని ఇచ్చింది. అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మంచి రికార్డు ఉన్న ప్రైమ్ వీడియోను ఎంచుకోవడం సహజంగా జరిగింది” అని అన్నాడు.

“అజిత్‌పాల్ క్రియేట్ చేసిన ఈ ఆకర్షణీయమైన ప్రపంచం నన్ను ‘స్టార్మ్‌’ వైపు ఆకర్షించింది. కథ చాలా వాస్తవంగా, శక్తివంతంగా ఉంది. ఇందులో అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులు పోషించబోయే మరపురాని పాత్రలు ఉన్నాయి. ఈ సిరీస్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది” అని అతడు చెప్పాడు.

ప్రైమ్ వీడియో స్పందన

ప్రైమ్ వీడియో ఏం చెప్పిందంటే?

ప్రైమ్ వీడియో వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ వెబ్ సిరీస్ పై స్పందించారు. హృతిక్ రోషన్ తో కలిసి వెబ్ సిరీస్ తీసుకువస్తుండటం ఓ ముఖ్యమైన మైల్ స్టోన్ అని అన్నారు. స్టార్మ్ ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో ఇది మరిన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనుంది. స్ట్రీమింగ్ తేదీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

హృతిక్ రోషన్ నిర్మాతగా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడం ఓ కీలక పరిణామం. ‘స్టార్మ్’ సిరీస్ గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రైమ్ వీడియో నమ్మకం వ్యక్తం చేసింది. త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.