|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాజమౌళి కొడుకు డైరెక్షన్‌లో స్టార్ హీరో! అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే!!

Published: 22-03-2026, 5:05 AM
షాకింగ్: రాజమౌళి కొడుకు డైరెక్షన్‌లో స్టార్ హీరో! అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే!!
  • రాజమౌళి తనయుడు కార్తికేయ త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నాడు – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • కార్తికేయ నిర్మాతగా ఆక్సిజన్ మూవీలో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు – ఇది భారీ ప్రాజెక్ట్!
  • అక్కినేని అఖిల్ హీరోగా కార్తికేయ దర్శకత్వంలో సినిమా అంటూ సినీ వర్గాల్లో జోరుగా చర్చలు!
  • దర్శకత్వంపై కార్తికేయకు ముందే అనుభవం ఉంది – సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!

టాలీవుడ్ సెన్సేషన్! రాజమౌళి తనయుడు కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అక్కినేని అఖిల్‌తో సినిమా అంటే ఇక రచ్చ రచ్చే! అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.

కార్తికేయ డైరెక్షన్ ఎంట్రీ?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని దేశవ్యాప్తంగా పెంచి.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టిన దర్శకులలో ఎస్‌ఎస్ రాజమౌళి ముందువరుసలో నిలుస్తాడు. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’భారతీయ సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రాముఖ్యతను దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి తెలియజేసేలా ఈ చిత్రం ప్రభావం చూపింది. టాలీవుడ్ ను చీప్ గా చూసేవారికి బాహుబలి తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చెంపపెట్టుగా మారింది. తెలుగు సినిమాకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

అంత ఘనత సాధించినా.. రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గా, కూల్ గా కనిపిస్తుంటారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, అనుకున్న తేదీకి విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

అఖిల్ హీరోగా ఫిక్స్ అయినట్టేనా?

ఇక అసలు విషయం ఏంటంటే.. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఇండస్ట్రీలో బిజీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తికేయ నిర్మాతగా ఆక్సిజన్ సినిమా రూపొందుతోంది. ఈసినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కార్తికేయ స్వయంగా నిర్మించడం విశేషంగా మారింది.ఈ సినిమా తర్వాత కార్తికేయ దర్శకుడిగా కూడా మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక స్టార్ హీరోతో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రాజమౌళి ఫ్యామిలీ నుండి మరో డైరెక్టర్!

ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ హీరోగా కార్తికేయ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కార్తికేయకు ముందుగా దర్శకత్వ విభాగంలో పని చేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన దర్శకత్వంలో సినిమా వస్తే అది ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై నిజమెంతో తెలియాల్సి ఉంది. ఈ విషయంపౌ ఇంత వరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కార్తికేయ డైరెక్షన్‌లోకి వస్తే టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి. అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.