
📌 Key Points
- రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
- డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు.
- ఇళ్లలో అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో అది బూటకపు బెదిరింపు అని నిర్ధారించారు.
- సైబర్ క్రైమ్ పోలీసులు తప్పుడు మెయిల్ పంపిన వ్యక్తి కోసం దర్యాప్తు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రజనీ, ధనుష్ ఇళ్లకు బెదిరింపు కాల్స్
Rajinikanth – Dhanush:గత కొంతకాలంగా సినిమా సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ వంటి బడా స్టార్ హీరోల ఇళ్లకు, ఆఫీసులకు వచ్చిన బాంబు బెదిరింపులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి. అయితే ఒక బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ధనుష్, రజనీకాంత్ , విజయ్ దళపతి, త్రిష వంటి స్టార్ సెలబ్రిటీల ఇళ్ళకి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఈ బాంబు బెదిరింపుల విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఇండియన్ సూపర్ స్టార్స్ అయినా రజినీకాంత్ , ధనుష్ ఇళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపులు రావడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గత కొంతకాలంగా తమిళనాడులో బాంబు బెదిరింపులు తరచుగా కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ గా చేసుకొని వస్తున్న ఈ బెదిరింపులు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రతినెల రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియన్ సూపర్ స్టార్స్ గా పేరు దక్కించుకున్న మామ అల్లుళ్ళు అయిన రజినీకాంత్ – ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.
అప్రమత్తమైన పోలీస్ శాఖ
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రజినీకాంత్ – ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహించారు. ఇకపోతే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు ..ఇకపోతే ఈ తప్పుడు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. మొత్తానికి అయితే ధనుష్ – రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు మళ్లీ వచ్చాయని తెలిసి కోలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..
దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఇకపోతే ఇలా ధనుష్ – రజినీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇదేమి తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ నెలలో చెన్నై పోయెస్ గార్డెన్ లో ఉన్న రజనీకాంత్ ధనుష్ ఇళ్లతో పాటు కీల్పాకంలో ఉన్న టిఎన్సిసి అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు డాగ్స్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ టీమ్స్ తో రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పైగా అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఇక అంతకు కొన్ని రోజుల ముందు అక్టోబర్ 13వ తేదీన సీఎం స్టాలిన్ , రజనీకాంత్ లకు ఇలాంటి బెదిరింపు ఈ – మెయిల్స్ రావడం గమనార్హం. ఏది ఏమైనా ఇలా తరచుగా బాంబు బెదిరింపులు రావడం అటు అభిమానులను , ఇటు ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. మరి దీనిపై అధికారులు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
మొత్తానికి రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కోలీవుడ్లో కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదివరకే ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం.


