
📌 Key Points
- రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా కొన్ని శక్తులు ఆపాయని ఆరోపణలు.
- విజయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
- డిఎంకే రజినీకాంత్ ను బెదిరించిందని టీవీకే అధినేత ఆరోపణ.
- రజినీకాంత్ కు మద్దతుగా నిలిచిన ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి.
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి ఆఖరి నిమిషంలో ఆగిపోవడం కలకలం రేపింది. కొన్ని అతీత శక్తులు ఆయన్ను అడ్డుకున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అసలు రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రాకుండా ఆపింది ఎవరు అనే దానిపై కథనం.
రజినీకాంత్ రాజకీయాల నుండి వైదొలగడానికి కారణం?
Rajinikanth:సినిమాలకి రాజకీయానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. అందుకే సినిమాలలో చేసిన వాళ్ళు రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంటే.. అటు రాజకీయాలలో చక్రం తిప్పిన వారు ఇటు సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా తాను కూడా రాజకీయాల్లోకి వెళ్లాలి అని ప్రయత్నాలు చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinkanth) ఆఖరి నిమిషంలో ఆగిపోవడం అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. సడన్గా ఎందుకు రజినీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిమానులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కానీ కొన్ని అతీత శక్తులు ఆయనను రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఆపాయి అనే కామెంట్లు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. అసలు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రాకుండా ఆపింది ఎవరు? తెరవెనుక మనకు తెలియని నిజాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలయ్యింది. ఈసారి తమిళనాట త్రిముఖ పోరు నెలకొంది. గతంలో డిఎంకె , అన్నా డిఎంకెల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండేది. కానీ ఈసారి సినీ నటుడు విజయ్ తన టీవీకే పార్టీతో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఇతర పార్టీలను కూడా తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మరొకవైపు విజయ్ తో పొత్తు కోసం బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది. విజయ్ ను ఎన్డీఏ లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి డిప్యూటీ సీఎంతో పాటు 80 సీట్లను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపించగా.. ఈ చర్చల్లో విజయ్ ముఖ్యమంత్రి పదవిని కోరినట్లు సమాచారం.
విజయ్ రాజకీయ ఎంట్రీతో సమీకరణాలు మారుతున్నాయా?
ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్, బిజెపి మధ్య పొత్తు చర్చలు దాదాపుగా ముగిసినట్లే అని తెలుస్తోంది . దీనికి కారణం సూపర్ స్టార్ రజినీకాంత్ అనే వాదన తెరపైకి వచ్చింది.అసలు విషయంలోకి వెళ్తే టీవీకే కీలక అధినేత అధవ్ అర్జున్.. రజనీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమయ్యాయి.. “రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డిఎంకే భయపెట్టింది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదం చెలరేగాయి.
డిఎంకె పార్టీతో పాటు అటు రజనీకాంత్ అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కే పళనిస్వామి ఈ వ్యాఖ్యలను రాజకీయంగా ఖండించారు. సూపర్ స్టార్ కి ఉన్న భారీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన రజనీకాంత్ కు మద్దతుగా నిలిచారు.. రజినీకాంత్ రాజకీయాలకు అతీతంగా అంతా అభిమానించే సినీ ప్రముఖుడు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడడం ఆమోదయోగ్యం కాదు అంటూ తెలిపారు. అలాగే బీజేపీ నేత అన్నామలై కూడా సూపర్ స్టార్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శించారు.
రజినీకాంత్ ను బెదిరించింది ఎవరు?
ఇకపోతే రజినీకాంత్ తన ఆరోగ్య సమస్యలు, కోవిడ్ 19 కారణం వల్లే 2020లో అధికారికంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు.. ఏది ఏమైనా రజనీకాంత్ రాజకీయ జీవితం గురించి టీవీకే పార్టీ కీలక నేత కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందిస్తారేమో చూడాలి.
రజినీకాంత్ రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వ్యవహారం తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి. రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి.


