
📌 Key Points
- నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’ చిత్రం
- సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు.
- ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘రాకాస’
- ‘పదే పదే’ పాటకి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ‘రాకాస’ చిత్రం నుంచి ‘పదే పదే’ అనే మెలోడీ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను, వారి కెమిస్ట్రీని చక్కగా చూపించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
‘రాకాస’ మూవీ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
Rakasa: ‘కమిటీ కుర్రోళ్లు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela).. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’ (Rakasa). మానస శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), నయన్ సారిక (Nayan Sarika) జంటగా నటిస్తున్నారు. ఏప్రిల్ 3న రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, గ్లింప్స్, టీజర్, సాంగ్ అన్నీ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో టీం బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం ‘పదే పదే’ (Padhe Padhe Lyrical Video) అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను టీమ్ రిలీజ్ చేసింది.
‘పదే పదే’ సాంగ్ విశేషాలు
ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని చూస్తుంటే హీరో మీద హీరోయిన్‌కి ఉన్న ప్రేమ, వన్ సైడ్ లవ్ స్టోరీని తెలియజేస్తోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, వారి ప్రేమను చాటేలా సాంగ్ సాగింది. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ‘‘పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్ను చేరగా ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ’’ అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ప్రేమను పట్టించుకోకుండా, తన పని ఏదో తను చూసుకుంటూ ఉంటాడు. మరి ఆ అమ్మాయి ప్రేమ, ఆ అబ్బాయికి ఎలా తెలిసిందనేది తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పాట
పాల విషయానికి వస్తే.. అనుదీప్ దేవ్ అందించిన స్వరాలు, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటను మరింత ప్రత్యేకంగా, గుండెల్ని హత్తుకునేలా మార్చేశాయి. కొత్తగా ప్రేమను తెలియజేయడానికి, కొత్తగా ప్రేమలో పడిన వారు పాడుకోవడానికి ఈ పాట పర్ఫెక్ట్ అనేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకోగా.. ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ ఏప్రిల్ 3న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణమ్మ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
‘రాకాస’ చిత్రం నుంచి విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి ఈ పాట బాగా నచ్చుతుంది. ఏప్రిల్ 3న సినిమా విడుదల కోసం ఎదురుచూడాల్సిందే.


