|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan: జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్, వాళ్ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్

Published: 08-12-2025, 11:48 PM
Ram Charan: జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్, వాళ్ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్
  • ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.
  • ‘పెద్ది’ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్.
  • జపాన్ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
  • రామ్ చరణ్ టీషర్ట్స్, సంతకం చేసిన బ్యాట్‌లను బహుమతిగా అందించారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అద్భుతమైన క్రేజ్ తో జపాన్ లోని అభిమానులను సైతం మంత్రముగ్ధులను చేశారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళిన ఆయన, అక్కడ అభిమానులను స్వయంగా కలిశారు. వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమే కాకుండా, ప్రత్యేకమైన బహుమతులను అందించి వారి ప్రేమను మరింత పెంపొందించారు.

రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్

Ram Charan : రామ్ చరణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ కి అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ (Oscar Award) అందించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతో ఈ ఇద్దరి హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారాయి.

చరణ్ కి అయితే ఏకంగా గ్లోబల్ స్టార్ అనే బిరుదిని ఇచ్చేసుకున్న మెగా ఫ్యాన్స్. ఈ చిత్రం జపాన్ లోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ టైంలో అక్కడ ఆడియన్స్ సందడి ఏ రేంజ్ లో ఉందో చూడాలి. ఈ హీరోల కోసం ఏకంగా ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా ఇచ్చేశారు . అయితే ఈసారి మన గ్లోబల్ స్టార్ జపాన్ అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. పెద్ది మూవీ సందర్భంగా జపాన్ వెళ్లిన చరణ్.. అక్కడ ఫ్యాన్స్ తో ఇంటారాక్ట్ అయ్యాడు. ఇంతకి అసలు సంగతేంటంటే .. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. రోజుల్లో ఒక పాటకు వంద మిలియన్ న్యూస్ రావటం అనేది సాధారణమైన విషయం కాదు ఏ ఆర్ రెహమాన్ స్టామినా ఏంటో మరోసారి అర్థమయింది .

జపాన్‌లో అభిమానులను కలిసిన చరణ్

ఇకపోతే ఈ సినిమాను మార్చి 27న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కొంతమంది ప్రాంతంతో సంబంధం లేకుండా ఇష్టపడటం అనేది కామన్ గా జరుగుతుంది. అలానే రామ్ చరణ్ ను కొంతమంది జపాన్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి మరి కలిశారు. చరణ్ వాళ్ళందరితో కొసేపు మాట్లాడి ఆటోగ్రాఫ్ అందించారు. జపాన్ అభిమానులంతా రామ్ చరణ్ గత సినిమాల్లోని కొన్ని స్టిల్స్ ను గ్రీటింగ్ కార్డ్స్ గా కట్ చేస్తూ చరణ్ కు చూపించారు. చరణ్ వాళ్ళ ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఇక పెద్ది సినిమాలో క్రికెట్ నేపథ్యం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి రామ్ చరణ్ వాళ్ళకు అందించారు. అలానే రామ్ చరణ్ టీషర్ట్స్ తో పాటు వాళ్లు కనిపించిన విధానం సోషల్ మీడియాలో నెటిజెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైల్ అవుతుంది.

ప్రత్యేకమైన బహుమతులు అందించిన మెగా పవర్ స్టార్

Mega Power Star @AlwaysRamCharan met fans from Japan who travelled all the way to see him and spent some quality time with them. ❤️ 🤗 #RamCharan #PEDDI pic.twitter.com/M7ulRrOlu1

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 8, 2025

జపాన్ అభిమానులు చూపించిన ప్రేమకు రామ్ చరణ్ ఆశ్చర్యపోయారు. వారి కోసం ప్రత్యేకంగా బ్యాట్‌లు, టీషర్ట్‌లపై సంతకం చేసి ఇచ్చారు. ఈ విధంగా చరణ్ తన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను మరోసారి చాటుకున్నారు, అభిమానులతో తన బంధాన్ని మరింత బలపరిచారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.