
📌 Key Points
- రామ్ చరణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
- ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌కు చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
- వారి కలయిక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలో కలిశారు. ఈ భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చరణ్ తన బాబాయ్‌కి శుభాకాంక్షలు తెలియజేయగా, ఈ అరుదైన కలయిక మెగా అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చింది.
రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ భేటీ విశేషాలు
Ram Charan Meets Pawan Kalyan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన బాబాయ్, ఆంధ్రప్రదేశ్ నూతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కలవడం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ‘పెద్ది’ సినిమాతో సాలిడ్ సక్సెస్ చూసిన చరణ్,పవన్ కళ్యాణ్‌ను కలవడం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.ఈ సాయంత్రం(జూన్ 24) జరిగిన ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ అండ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అసలైతే రామ్‌చరణ్ అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వెళ్తూ, దారిలో బాబాయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి మంగళగిరి ఆఫీస్‌కు వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. చరణ్ స్వయంగా వచ్చి బాబాయ్‌ని కౌగిలించుకుని, శాలువాతో సత్కరించి తన అభినందనలు తెలియజేశారు. ఈ క్రేజీ మీట్‌లో కేవలం రాజకీయాలే కాకుండా, ఫ్యామిలీ ముచ్చట్లు, సినిమా విశేషాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశం
ప్రస్తుతం రామ్‌చరణ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటికే పెద్ది సినిమా 400కోట్ల పై చిలుకు వసూలు చేయడంతో నిన్న గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.మరో వైపు పవన్ సుజిత్ తో OG 2 ని పట్టాలెక్కించడానికి ప్లాన్ వేస్తున్నట్టు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది.
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to… pic.twitter.com/xavBCDx9zK
సోషల్ మీడియాలో వైరల్ ట్రెండింగ్
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2026
ఇక ఇదిలా ఉంటె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఇద్దరి భేటీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అటు ఏపీఎల్ క్రికెట్ హంగామా, ఇటు బాబాయ్-అబ్బాయ్ ల పొలిటికల్ అండ్ సినీ గ్లామర్ కలగలిసి ఈ రోజును మెగా ఫ్యాన్స్‌కు ఒక మెమరబుల్ డేగా మార్చేసింది.చూడాలి మరి ఫోటోలకి కలిసి ఫోజులిచ్చిన ఈ బాబాయ్, అబ్బాయిలు కలిసి సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారో !
బాబాయ్-అబ్బాయ్ భేటీ కేవలం రాజకీయ, సినీ చర్చలకే పరిమితం కాకుండా, కుటుంబ బంధానికి ప్రతీకగా నిలిచింది. ఈ కలయిక మెగా అభిమానులకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు.


