
📌 Key Points
- లండన్ మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు.
- తనతో పాటు రైమ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఉపాసన కోరిక.
- విగ్రహం ఏర్పాటుపై మొదట రామ్ చరణ్ విముఖత.
- ఉపాసన కోరిక మేరకు అంగీకరించిన రామ్ చరణ్.
రామ్ చరణ్ లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడారు. తొలుత తనకు ఇష్టం లేకపోయినా, ఉపాసన తన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరడంతో అంగీకరించినట్లు తెలిపారు.
మైనపు విగ్రహంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. తాజాగా రామ్ చరణ్ ఎస్వైర్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్(Ramcharan) తన పెట్ రైమ్ (Rhyme)గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని(Wax Statue) ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సందర్భంగా చరణ్ మాట్లాడారు. రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో (Madam Tussadus) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .ఈ విగ్రహాన్ని 2025 మే9 న ఏర్పాటు చేశారు.
ఇక రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయటం విశేషం. అయితే తాజాగా చరణ్ ఎస్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ మైనపు విగ్రహం గురించి మాట్లాడుతూ నిజానికి తనకు ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. కానీ ఉపాసన తనతో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆ తర్వాతనే తాను ఒప్పుకున్నానని రామ్ చరణ్ తెలియజేశారు.
రైమ్ కోసమే విగ్రహానికి అంగీకరించిన చరణ్
ఉపాసన ఇలా చెప్పడంతో తాను కాస్త ఎమోషనల్ అవ్వటమే కాకుండా , ఇది తమ కుటుంబం అలాగే మా మధ్య ఉన్న ప్రేమకు సంబంధించినదని రామ్ చరణ్ భావించారట. తనతో పాటు రైమ్ ను చేర్చడం ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అందుకే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంతోషంగా అంగీకరించానని రామ్ చరణ్ ఈ సందర్భంగా తన విగ్రహం గురించి తెలియజేశారు. ఇలా తన రైమ్ తో పాటు తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది తన కెరియర్ లో ఒక మైలురాయి మాత్రమే కాదు తన వ్యక్తిగత జీవితాన్ని ఈ గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ముడిపెట్టిన అద్భుతమైన క్షణం అంటూ తెలిపారు.
చరణ్ తో పాటు రైమ్ విగ్రహం..
కుటుంబ బంధం, ప్రేమను తెలిపే అద్భుత క్షణం
ఈ విధంగా రాంచరణ్ తనకు ఇష్టం లేకపోయిన కేవలం రైమ్ కోసమే మైనపు విగ్రహ ఏర్పాటుకు అంగీకరించారని తెలిసిన అభిమానులు తన రైమ్ పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో స్పష్టం అవుతుంది. ఇకపోతే మన సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సెలబ్రిటీల విగ్రహాలను మ్యూజియంలో ఇదివరకే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల మైనపు విగ్రహాలను లండన్, దుబాయ్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో పాటు ఆయన పెట్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది ఒక రామ్ చరణ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన విగ్రహంతో పాటు రైమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తన జీవితంలో ఒక మైలురాయి అని, ఇది తమ కుటుంబ బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.


