
📌 Key Points
- రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
- ఆంధ్ర కింగ్ మూవీతో రామ్ సక్సెస్ అందుకున్నారు.
- కిషోర్ తిరుమలతో రామ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూపులు.
- రొమాంటిక్ లవ్ స్టోరీతో రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని మరోసారి కిషోర్ తిరుమలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఈసారి కూడా అదే ఫలితం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
రామ్ పోతినేని కెరీర్ తొలినాళ్లలో హిట్స్
Ram Pothineni : టాలీవుడ్ స్టార్ హీరో స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో రామ్ ఖాతాలో సక్సెస్ మూవీ పడింది. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలను లైనట్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నారు.. ఈసారి రాబోతున్న సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రామ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ క్రమంలో గతంలో చేసిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? స్టోరీ లైన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
హీరో రామ్ పోతినేని కెరియర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటించాడు. రామ్ హీరోగా ఒక డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందని.. అలాగే ఆర్కా మీడియా బ్యానర్‌లో ప్రాజెక్ట్ ఉంటుందనే వార్తలు ఈ మధ్య ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ప్రాజెక్టు ను రామ్ పక్కన పెట్టినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన తన ఇమేజ్‌కు సరిపోయే పక్కా కమర్షియల్ అండ్ ఎమోషనల్ కథలు వినేందుకు సిద్ధమవుతున్నాడట.. రామ్ కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన నేను శైలజ మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఆ కథను విన్న రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. అదే కనుక నిజమైతే బ్లాక్ బాస్టర్ పడటం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కిషోర్ తిరుమలతో రామ్ మూవీ?
రొమాంటిక్ లవ్ స్టోరీతో రామ్
గతంలో రామ్ యాక్షన్ సినిమాలు కన్నా ఎక్కువగా లవ్ అండ్ ఎంటర్టైనర్ సినిమాలలోని నటించాడు. ఆ స్టోరీలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సినిమాలన్నీ కూడా రామ్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.. రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కాస్త పర్వాలేదు అనిపించింది. దాంతో రామ్ మళ్లీ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఆయన రొమాంటిక్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే రామ్ ఖాతాలో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ పడిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి ఒక క్లారిటీ రానుంది.. ఈ సినిమా తర్వాత మరో యాక్షన్ మూవీలో నటించే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రామ్ అకౌంట్ లో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పడలేదు. ఒక్క హిట్ పడితే మళ్ళీ ట్రాక్ మారిపోతుంది..
మొత్తానికి రామ్ పోతినేని మళ్లీ తన లవ్ స్టోరీ రూట్ లోకి వస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోయే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.


