|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయణ అప్‌డేట్.. యశ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

Published: 07-07-2025, 1:42 PM
రామాయణ అప్‌డేట్.. యశ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం సినిమా గురించి తాజా అప్‌డేట్స్ వచ్చాయి. యశ్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాలో యశ్ కనిపించే సమయం తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Key Points

1

రామాయణం లో యశ్ కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించనున్నారు.

2

మొదటి భాగంలో జానకీరాముల కళ్యాణం, పట్టాభిషేకం సన్నివేశాలు ఉంటాయి.

4

యశ్ ఫ్యాన్స్ ఈ విషయం గురించి బాధపడుతున్నారు.

రామాయణం మొదటి భాగం వివరాలు

బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణ గ్లింప్స్ సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా.. యశ్ రావణుడిగా నటిస్తున్న సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దాదాపు రూ. 2000కోట్లు ఇందుకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ పార్ట్‌కు హీరో రూ. 70కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.. హీరోయిన్ నాలుగు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ కూడా అన్నీ బయటకు వచ్చేశాయి. కానీ చాలా మంది నటీనటుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణుడిగా యశ్‌ను చూజ్ చేసుకోవడం తప్ప మిగతా స్టార్స్‌ను రాంగ్‌గా చూజ్ చేసినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాయణ నుంచి వచ్చిన మరో అప్డేట్ సినిమాకు నెగెటివ్ అవుతుందనే టాక్‌కు తెరలేపింది. కారణం యశ్ మొదటి పార్ట్‌లో కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అవును.. ఫస్ట్ పార్ట్‌లో జానకీరాముల కళ్యాణం, పట్టాభిషేకం ఉంటుందని.. ఎండింగ్‌లో రావణుడు, సీతను ఎత్తుకుపోయే సీన్స్‌తో సినిమాకు శుభం పడుతుందని తెలుస్తోంది. ఇక సెకండ్ పార్ట్‌లోనే యశ్‌ను ఫుల్ ఫ్లెడ్జ్‌గా తెరపై చూడబోతున్నట్లు సమాచారం. కాగా ఈ న్యూస్ విన్న యశ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

యశ్ పాత్ర పొడవు

అభిమానుల స్పందన

చివరగా, రామాయణం సినిమా యశ్ అభిమానులకు కొంత నిరాశను కలిగించింది. అయితే, రెండవ భాగంలో యశ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.