
📌 Key Points
- రవితేజ, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హర్రర్ కథాంశంతో సినిమా చేయనున్నారు.
- ఈ చిత్రంలో రవితేజను ఢీ కొట్టడానికి ఎస్. జె. సూర్య విలన్ పాత్రలో నటించనున్నారు.
- రవితేజ గత చిత్రం ‘మాస్ జాతర’ ప్రేక్షకులను నిరాశపరిచింది.
- శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
మాస్ మహారాజా రవితేజ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఎస్. జె. సూర్య విలన్ పాత్రలో రవితేజను ఢీ కొట్టనున్నారు. ఈ వార్త రవితేజ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివేక్ ఆత్రేయతో రవితేజ హర్రర్ మూవీ
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ(Raviteja) హిట్ ఫ్లాపులను పక్కనపెట్టి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా ఇటీవల కాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పరవాలేదనిపించుకుంది కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక రవితేజ తదుపరి సినిమాని శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే గత రెండు రోజులుగా రవితేజ కొత్త సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈయన వివేకాత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఎస్. జె. సూర్య విలన్ పాత్రలో?
వివేక్ ఆత్రేయ రవితేజ కోసం ఒక హర్రర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ స్క్రిప్ట్ విన్న రవితేజ ఎంతో ఇంప్రెస్ అయ్యారని వివేకాత్రేయతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాలి. ఇన్ని రోజులు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన రవితేజ ఇకపై భయపెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇలా రవితేజ వివేకాత్రేయ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలు ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య(S.J.Suriya) నటించబోతున్నారని తెలుస్తోంది.
ఇలా రవితేజను ఢీ కొట్టడానికి ఎస్ జె సూర్య రంగంలోకి దిగబోతున్నారనే విషయం తెలియడంతో సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎస్ జె సూర్య దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో నటుడిగా ఈయన ముఖ్యంగా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాల్లో కూడా విలన్ గా కనిపించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే థియేటర్ లు తగలబడటం ఖాయం అంటూ రవితేజ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి రవితేజ, వివేక్ ఆత్రేయ సినిమా గురించి, ఇందులో ఎస్ జె సూర్య నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల గురించి ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రవితేజ తదుపరి చిత్రాల వివరాలు
రవితేజ, ఎస్. జె. సూర్య మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సినిమా రవితేజ కెరీర్ కు కొత్త ఊపునిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


