
📌 Key Points
- నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర ట్రోల్స్ చేసిన వ్యక్తిని ఏపీలో అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
- గుంటూరుకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు చేయడంతో చర్యలు.
- వీధి కుక్కల గురించి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై దారుణంగా స్పందించిన నెటిజన్లు.
- రేణు దేశాయ్ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.
సినీ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.
రేణు దేశాయ్‌పై ట్రోల్స్‌కు కారణం ఏమిటి?
Renu desai:ప్రముఖ సినీనటి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) కి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్ ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమెను , ఆమె పిల్లల్ని టార్గెట్ చేస్తూ కొంత మంది నెటిజన్స్ విచక్షణారహితంగా ట్రోల్స్ చేస్తూ.. వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా తాము ఆర్టిస్టులమని, సున్నిత మనస్కులమని, దయచేసి తమ మీద ఇలాంటి నీచాతి నీచమైన కామెంట్లు చేయడం తగదు అంటూ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ వేడుకున్నప్పటికీ కొంతమంది ఆమెపై అదే పనిగా ట్రోల్స్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ ట్రోల్స్ ఎదుర్కోలేక రేణు దేశాయ్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా రేణు దేశాయ్ పై అసభ్యకర కామెంట్లు చేస్తున్న ఏపీ గుంటూరుకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తిని నేడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా రేణు దేశాయ్ పై వస్తున్న ఇలాంటి ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి.
సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరెస్ట్
రేణు దేశాయ్ పై , అలాగే ఆమె పిల్లలపై విపరీతమైన ట్రోల్స్ జరగడానికి అసలు కారణం ఏమిటి అనే విషయానికొస్తే .. గత కొంతకాలంగా వీధి కుక్కలు జనాలపై దాడి చేస్తూ వారిని గాయపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చింది . ఈ తీర్పు పై రేణు దేశాయ్ స్పందిస్తూ.. “పదిలో 9 కుక్కలు మంచివి. ఎక్కడో ఒక కుక్క తప్పు చేసిందని అన్నింటినీ ఇబ్బందులకు గురి చేయడం తప్పు.. మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించే కుక్కలు కనిపిస్తే మా సంస్థకు ఫోన్ చేయండి.. వెంటనే మేము తీసుకెళ్తాం” అంటూ ఆమె కామెంట్లు చేసింది ..దీనిని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు, రేణు దేశాయ్ పై అలాగే ఆమె పిల్లలపై కుక్కలు దాడి చేయాలి.. ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తే అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది .. అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేశారు. అంతే కాదు వినలేని, మాట్లాడలేని మాటలను కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇక ప్రస్తుతం పోలీసులు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.
రేణు దేశాయ్‌పై జరుగుతున్న ఈ ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి. సైబర్ పోలీసులు నిందితులను పట్టుకుంటున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


