|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు: మనుషులు శాశ్వతం కాదు, ద్వేషం వీడండి! ప్రభాస్ ‘కల్కి’ సినిమాను ఉదహరిస్తూ కామెంట్స్!

Published: 23-01-2026, 3:05 AM
రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు: మనుషులు శాశ్వతం కాదు, ద్వేషం వీడండి! ప్రభాస్ 'కల్కి' సినిమాను ఉదహరిస్తూ కామెంట్స్!
  • స్ట్రీట్ డాగ్స్ విషయంలో రేణూ దేశాయ్ కామెంట్స్ వివాదాస్పదం.
  • ప్రెస్ మీట్ లో తన వ్యాఖ్యలను వక్రీకరించారని రేణూ ఆవేదన.
  • మనుషులు, జంతువులు అందరూ బాగుండాలని రేణూ దేశాయ్ ఆకాంక్ష.
  • ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాను ఉదహరించిన రేణూ దేశాయ్.

ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ వీధి కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆమె స్పందించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రేణూ దేశాయ్ కామెంట్స్ పై వివాదం

Renudesai:ప్రముఖ హీరోయిన్ రేణూదేశాయ్ (Renudesai)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం సింగిల్ పేరెంట్ గా కెరియర్ కొనసాగిస్తున్న ఈమె.. తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరొకవైపు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అయితే ఈమధ్య గత కొంతకాలంగా స్ట్రీట్ డాగ్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఈమె చేస్తున్న కామెంట్లు కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అంతేకాదు పలు విమర్శలకు కూడా దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈమె మరో వీడియో షేర్ చేసి మనుషులు మొత్తం పోతారు అంటూ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాను ఉదహరించి మరీ చెప్పడంతో ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగిందని చెప్పాలి.

విషయంలోకి వెళ్తే.. వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తోంది. మరొకవైపు వీధి కుక్కలపై ప్రజలు దాడులు చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ నిర్వహించి మరీ కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. అలా ప్రెస్ మీట్ లో భాగంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరి కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తన మాటలను తప్పుగా అర్థం చేసుకొని ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్.

వీధి కుక్కల సమస్యపై రేణూ ఆవేదన

తాజాగా రేణు దేశాయ్ విడుదల చేసిన ఆ వీడియోలో.. ప్రెస్ మీట్ లో తాను ఏం చెప్పాలనుకున్నానో.. ఆ తర్వాత వివాదం ఎందుకు జరిగిందో అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను 30 నిమిషాల పాటు మాట్లాడితే అందులో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ను తమకు నచ్చినట్టుగా కట్ చేసి వేరే అర్థం వచ్చేలా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా నా వ్యాఖ్యల ఉద్దేశాన్ని వక్రీకరించడం వల్లే ఈ రాద్ధాంతం ఏర్పడింది. మనుషులైనా.. జంతువులైనా.. అందరూ బాగుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. కొన్ని సందర్భాలలో కుక్కల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న విషయాన్ని నేను ప్రస్తావించగానే.. అందుకే అన్ని కుక్కలను చంపేయాలని నేను అన్నట్లు నా మాటలు వక్రీకరించారు..నేను ఎక్కడ ఈ మాట చెప్పలేదు. సమస్యను మానవీయంగా, శాంతియుతంగా పరిష్కరించాలని నేను అభిప్రాయపడ్డాను.

ఈ జీవితం తాత్కాలికం మాత్రమే.. కుక్కలు, పిల్లులు, కోతులు మాత్రమే కాదు.. మనుషుల జీవితము శాశ్వతం కాదు.. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే .. కాబట్టి ద్వేషం, ఆగ్రహంతో కాకుండా సహజీవన భావనతో ముందుకు వెళ్లాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను కూడా ఆమె ఉదాహరణగా ప్రస్తావించడం మరో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూశారా? అదే కలియుగం.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి వారైనా సరే అందరం అక్కడికి వెళ్లాల్సిందే కదా.. కాబట్టి ప్రశాంతంగా, మంచిగా ఉండాలని సూచించింది. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ద్వేషం వీడాలని రేణూ దేశాయ్ పిలుపు

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

రేణూ దేశాయ్ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తూ, ద్వేషాన్ని వీడి మానవత్వంతో మెలగాలని కోరారు. ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.