
📌 Key Points
- సాయి పల్లవి త్వరలో దివంగత గాయకురాలు M.S. సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించనున్నారు.
- గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు.
- సుబ్బులక్ష్మి పాత్ర కోసం సాయి పల్లవి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు.
- సాయి పల్లవి ఇప్పటికే ‘రామాయణం’ సినిమాలో సీత పాత్రలో కనిపించనున్నారు.
సాయి పల్లవి దివంగత గాయకురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం సాయి పల్లవి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు. ఈ వార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
సుబ్బులక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి
Sai Pallavi: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్ లో ట్రెండ్ నడుస్తోంది. అటు సామాజికంగా ఇటు సినిమా పరంగా ఎంతో విశేష సేవ అందించిన సెలబ్రిటీల జీవిత కథలను బయోపిక్ ల రూపంలో తెరపై చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీల బయోపిక్ లు తెరపై సందడి చేయగా.. ఇప్పుడు మరో బయోపిక్ సిద్ధం అవుతోంది. అయితే ఇందులో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) లీడ్ రోల్ పోషిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి “హైబ్రిడ్ పిల్లా” అంటూ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనతో అభిమానుల చేత లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా దక్కించుకుంది. అలాంటి సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో రణబీర్ కపూర్ రాముడిగా.. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ కల్కి 2898 AD సినిమా సీక్వెల్ కల్కి 2లో దీపికా పదుకొనే పాత్రలో సాయి పల్లవి ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
పాత్ర కోసం సాయి పల్లవి శిక్షణ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లెజెండ్రీ దివంగత గాయకురాలు M.S. సుబ్బులక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి నటిస్తున్నట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట. ఈ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రలో నటించడానికి సాయి పల్లవి కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇన్ని రోజులు సింపుల్గా సాఫ్ట్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు లెజెండ్రీ గాయకురాలు బయోపిక్ లో నటించబోతోంది అని తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి విషయానికి వస్తే.. మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి.. కర్ణాటక సంగీత విధ్వంసరాలు..ప్రముఖ గాయని, నటి కూడా.. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి కూడా.. ఆసియా నోబెల్ ప్రైజ్ గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా కూడా ఈమె పేరు దక్కించుకుంది.. కర్ణాటక సంగీతంలో ఆరితేరిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి చెన్నై తమిళనాడులో జన్మించారు. 1916 సెప్టెంబర్ 16న జన్మించిన ఈమె ఊపిరితిత్తుల న్యూమోనియా హృదయ సంబంధిత సమస్యలతో 2004 డిసెంబర్ 11న 88 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఇప్పుడు అలాంటి ఈమె గొప్ప జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.
సాయి పల్లవి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించడం ఆమె కెరీర్ లో ఒక మైలురాయి కానుంది. ఈ చిత్రం ద్వారా ఆమె నటన మరింత మెరుగుపడుతుందని ఆశిద్దాం.


