|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి బాక్సాఫీస్ వార్: సినిమా టికెట్ల ధరల రచ్చ! ఏ సినిమా ఎంత పెంచిందంటే?

Published: 02-01-2026, 8:30 PM
సంక్రాంతి బాక్సాఫీస్ వార్: సినిమా టికెట్ల ధరల రచ్చ! ఏ సినిమా ఎంత పెంచిందంటే?
  • సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి, రవితేజ సహా పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదల.
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ పెయిడ్ ప్రీమియర్లకు ₹800 టికెట్ పెంపునకు యోచన.
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్లకు ₹500 పెంపునకు నిర్మాతల ప్రయత్నాలు.
  • తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తున్నందున అనుమతిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. నిర్మాతలు ప్రీమియర్లకు టికెట్ ధరల పెంపుపై దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ల పెంపుపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అనుమతి లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఎవరు?

Ticket Prices Hike:  ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగులో ఏకంగా ప్రభాస్, రవితేజ, చిరంజీవి లాంటి హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. వీరితోపాటు శర్వానంద్ నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐదు సినిమాలు విడుదలవుతుండగా కోలీవుడ్ నుంచి మరో రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే నువ్వా నేనా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక తెలుగులో ప్రభాస్(Prabhas) నటించిన ది రాజా సాబ్(The Raja Saab), చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా 8వ తేదీన పెయిడ్ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్లకు సినిమా టికెట్ల ధరలను పెంచాలనే ఆలోచనలు నిర్మాతలు ఉన్నారు. ది రాజా సాబ్ సినిమా పెయిడ్ ప్రీమియర్లను 800 రూపాయలను పెంచాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉండటమే కాకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రీమియర్లు ఎనిమిదో తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నాయి.

ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ ధరల యోచన

ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే చిరంజీవి (Chiranjeevi) అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 11 వ తేదీ ప్రసారం కానున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ల టికెట్ల రేట్లు పెంచే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ప్రీమియర్ల టికెట్ ధరలు 500 పెంచడం కోసం నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచమని నిర్మాతలు ఎవరు మా వద్దకు రావద్దు అంటూ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం అనుమతి ఇస్తుందా?

తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా?

ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలకు తెలంగాణలో టికెట్ ధర పెంపు విషయంలో అనుమతి లభిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13వ తేదీ విడుదల కానుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి జనవరి 15న విడుదల కాగా 14వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. వీటితోపాటు నవీన్ పోలిశెట్టి సైతం అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. వీరితోపాటు విజయ్ దళపతి జననాయగన్, శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే పోటీ పడిపోతున్నాయి.

సంక్రాంతి సినిమాల టికెట్ ధరల పెంపుపై తుది నిర్ణయం కోసం ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో మరింత చర్చకు దారితీస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.