
📌 Key Points
- కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’ మూవీలో నటిస్తున్నారు.
- దర్శకుడు రితేష్ రానా, సత్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
- ఏప్రిల్ 2న ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
- ఈ సినిమా ద్వారా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు.
కమెడియన్ సత్య హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో ‘జెట్లీ’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంతో రియా సింఘా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు.
హీరోగా సత్య.. డైరెక్టర్ రితేష్ రానా!
Jetlee Movie: కమెడియన్ సత్య (Satya).. ఇప్పుడీ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. ఒకప్పుడు సునీల్, కమెడియన్‌గా ఎలా అయితే చెలరేగిపోయాడో.. ఇప్పుడు ఆ స్థానంలో సత్య ఇండస్ట్రీని ఏలుతున్నాడు. టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తూ, ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాలో అవకాశం పొందుతున్న సత్య.. కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సినిమా చేస్తున్నారు. సత్య హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ రితేష్ రానా (Ritesh Rana) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘జెట్లీ’ (Jetlee Movie). ‘మత్తు వదలరా’ వంటి హిట్ తర్వాత ఈ ద్వయం మళ్ళీ జతకడుతుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ (Clap Entertainment) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
‘జెట్లీ’ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్
ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ చిత్ర టీమ్ సరికొత్త పంథాలో, నిత్యం వార్తలలో ఉంటుంది. ముఖ్యంగా సత్యని మాములుగా వాడటం లేదు. సత్యతో ఇప్పటికే పలు వీడియోలు చేసిన మేకర్స్ వదిలారు. ప్రతి వీడియో మంచి ఆదరణను రాబట్టుకుంటూ, సినిమాపై భారీగా క్రేజ్‌ని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మంగళవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ (Satya is not Jetlee) అనే ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సత్య స్టైలిష్ లుక్ చూస్తుంటే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాదు, రితేష్ రానా మార్క్ యూనిక్ హ్యూమర్, హై-ఎనర్జీ యాక్షన్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌కి మిస్ యూనివర్స్ ఇండియా ఎంట్రీ
ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా (Rhea Singha) టాలీవుడ్‌కి పరిచయం అవుతుండటం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో సహా ‘మత్తు వదలరా’ టీమ్ అంతా ఈ సినిమా కోసం మరోసారి పని చేస్తున్నారు. ఒక వెరైటీ సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేయడంలో దిట్ట అయిన రితేష్ రానా, ‘జెట్లీ’తో ఆడియన్స్‌కు ఒక ఫన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాబోయే ప్రమోషనల్ కంటెంట్ మరింత వైవిధ్యంగా ఉంటుందని, సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను నాన్ స్టాప్‌గా నవ్విస్తుందని, ఈ సందర్భంగా నిర్మాతలు చెబుతున్నారు.
మొత్తానికి ‘జెట్లీ’ సినిమా సత్య కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోనుంది. ఏప్రిల్ 2న విడుదల కాబోయే ఫస్ట్ సింగిల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.

