|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు! ఆ ముగ్గురినీ ఎప్పటికీ మరచిపోవద్దన్న హీరో!

Published: 27-03-2026, 3:05 AM
శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు! ఆ ముగ్గురినీ ఎప్పటికీ మరచిపోవద్దన్న హీరో!
  • శర్వానంద్ తన జీవితంలో ముగ్గురిని మర్చిపోకూడదని విద్యార్థులకు సూచించారు.
  • కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
  • తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు ఏదైనా సాధించగలరని శర్వానంద్ పేర్కొన్నారు.
  • తన 23 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

హీరో శర్వానంద్ తన రాబోయే ‘బైకర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మదనపల్లిలోని మిట్స్ విద్యార్థులతో మాట్లాడారు. జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, వదిలేసిన వారిని, కష్టాల్లోకి నెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని ఆయన సూచించారు.

శర్వానంద్ స్ఫూర్తిదాయక ప్రసంగం

Sharwanand:విభిన్న కథంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన నటనతో మెప్పిస్తూ దూసుకుపోతున్న హీరో శర్వానంద్ (Sharwanand ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అలాంటి ఈయన చివరిగా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఇప్పుడు ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా మారిన శర్వానంద్.. అందులో భాగంగానే తాజాగా మదనపల్లిలోని మిట్స్ విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగ భరిత ప్రసంగం ఇచ్చారు. అందులో భాగంగానే జీవితంలో ఆ ముగ్గురిని మాత్రం మర్చిపోకండి అంటూ కామెంట్ చేశారు.

తాజాగా శర్వానంద్ మాట్లాడుతూ..” లైఫ్ లో ఎవరైనా సరే ఆ ముగ్గురిని మాత్రం మర్చిపోకండి. మీ కష్టంలో మీతో ఉన్న వాళ్ళని, అలాగే మీరు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన వాళ్లని, మిమ్మల్ని కష్టంలోకి నెట్టిన వాళ్ళని.. ఇలా ఈ ముగ్గురిని ఎప్పటికీ మీరు మీ జీవితంలో మర్చిపోకండి. అందరినీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి.. ఇక పక్కవారితో పిల్లల్ని ఎప్పుడూ కూడా పోల్చవద్దు. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే పిల్లలు ఏదైనా సాధిస్తారు”. అంటూ శర్వానంద్ తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ చేసిన ఈ కామెంట్లు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ముగ్గురు

ఇకపోతే హీరో శర్వానంద్ కూడా అందరి హీరోల లాగానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 17 ఏళ్ల వయసులో తాను ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడతానంటే.. నువ్వు హీరో ఏంట్రా.. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అని అవమానించారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ..” నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ పై మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. 23 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. బైకర్ సినిమా నా కెరియర్ లో 36వ చిత్రం. జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుంటే.. అందరూ అడ్డకట్ట వేసేవారే .. ఎవరి మాట వినద్దు.. పెద్దగా కలలు కనండి .. తలుచుకుంటే ఏదైనా చేయగలం అని నిరూపించండి . నిరుత్సాహపరిచేలా ఎవరైనా మాట్లాడితే వారి మాటలు మౌనంగా విని పక్కకు వెళ్లిపోండి. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అయిన నేను నటుడి కావాలని గట్టిగా అనుకున్నాను. కాబట్టి ఈరోజు మీ ముందు నిలుచున్నాను. ఇక మీలాంటివారు అనుకుంటే ఏదైనా సరే సాధించగలుగుతారు? ఎవరు ఏమన్నా మీరు మీ సక్సెస్ తోనే అందరికీ సమాధానం చెప్పాలి” అంటూ శర్వానంద్ తెలిపారు.

ప్రోత్సాహంతోనే విజయాలు సాధ్యం

బైకర్ సినిమా గురించి మాట్లాడుతూ..” బైకర్ సినిమా ఏప్రిల్ మూడవ తేదీన రాబోతోంది.. ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పకుండా తన తండ్రితో కలిసి ఈ సినిమా చూడండి. సంక్రాంతికి చెప్పి నేను హిట్టు కొట్టాను. ఇప్పుడు సమ్మర్ కి వస్తున్నాను. మళ్ళీ హిట్ కొడతాను” అంటూ తన ధీమా వ్యక్తం చేశారు శర్వానంద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక శర్వా చెప్పినట్టుగానే మళ్లీ తన ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి.

శర్వానంద్ మాటలు యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. ఆయన తన జీవితానుభవాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.