
📌 Key Points
- శర్వానంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా.
- ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశం.
- కాంతారా సినిమాతో రుక్మిణి వసంత్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
- 2027 సంక్రాంతికి విడుదల కానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కాంతారా సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ సినిమా
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలను చవిచూస్తూ కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కేవలం నిరాశ మాత్రమే మిగిలింది కానీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ నారి నారి నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
2026 సంక్రాంతి హిట్ సినిమాగా నారీ నారీ నడుమ మురారి సినిమా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శర్వానంద్ వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన బైకర్ అనే సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. త్వరలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ సినిమా కాకుండా శర్వానంద్ తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
హీరోయిన్ గా రుక్మిణి వసంత్?
శర్వానంద్ శ్రీనువైట్ల డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా ఎన్టీఆర్ డ్రాగన్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) నటించబోతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.
కాంతారా 1 తో పాన్ ఇండియా క్రేజ్..
2027 సంక్రాంతికి విడుదల
ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ఇలా శర్వానంద్ సినిమాలో రుక్మిణి వసంత్ నటించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈమె ఇటీవల కాంతారా 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్న రుక్మిణి శర్వానంద్ సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలియడంతో శర్వానంద్ క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. మరి శర్వానంద్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల ఇటీవల కెరియర్ పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి .మరి శర్వానంద్ శ్రీను వైట్లకు ఎలాంటి సక్సెస్ ఇస్తారో తెలియాల్సి ఉంది.
మొత్తానికి శర్వానంద్ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


