|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హోస్ట్ టు హీరో: శివ కార్తికేయన్ సంచలన ప్రస్థానం!

Published: 03-02-2026, 11:05 PM
హోస్ట్ టు హీరో: శివ కార్తికేయన్ సంచలన ప్రస్థానం!
  • శివ కార్తికేయన్ హోస్ట్ నుండి స్టార్ హీరోగా ఎదిగారు.
  • ఆయన 1985 ఫిబ్రవరి 17న శివగంగై జిల్లాలో జన్మించారు.
  • విజయ్ టీవీలో కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు.
  • 2012లో మెరీనా సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

ప్రముఖ కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సినీ ప్రయాణం 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శివ కార్తికేయన్ బాల్యం, విద్యాభ్యాసం

Siva Karthikeyan:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హోస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన శివ కార్తికేయన్.. ఆ తర్వాత స్టార్ హీరోగా అవతరించి ఎన్నో మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఈ 14 సంవత్సరాల సినీ ప్రయాణంలో హోస్ట్ నుంచి స్టార్ గా ఎదగడం వరకు ఆయన కెరియర్లో జరిగిన ఆ మరుపు రాని ఘట్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

1985 ఫిబ్రవరి 17న శివగంగై జిల్లాలోని సింగంపునారి సమీపంలోని పిరాన్మలై అనే ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి జి. డాస్ జైలు సూపరిండెంట్ గా పనిచేసేవారు. ఈయనకు ఒక అక్క కూడా ఉంది. ఆమె డాక్టర్ గా పనిచేస్తున్నారు. జే .జే. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బ్యాచిలర్ డిగ్రీను పొందిన ఈయన 2010 ఆగస్టు 27న ఆర్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా, ఒక కుమార్తె , ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఇక శివ కార్తికేయన్ కాలేజీలో చదువుకునేటప్పుడే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారట. అలా మిమిక్రీ , స్టాండప్ కామెడీని ప్రదర్శించి మంచి కమెడియన్ గా అప్పట్లోనే పేరు దక్కించుకున్నారు.

హోస్ట్ నుండి హీరోగా మారిన వైనం

స్టార్ విజయ్ ఛానల్లో ప్రసారమైన కామెడీ రియాలిటీ షో కలక్క పోవతు యారు ? ఆడిషన్స్ లో పాల్గొని ఎన్నికైన తర్వాత.. ఈ షో కోసం చదువుని మూడు నెలలు పక్కన పెట్టారు. ఇక 2006లో రెండవ సీజన్లో కూడా పాల్గొని టైటిల్ ని గెలుచుకున్నారు కూడా.. ఇక నిర్మాతలు ఇతడిని గమనించి 2008లో ‘ఏగెన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే ‘ముగపుతగం’ అనే షార్ట్ ఫిలిం ద్వారా నటన రంగంలోకి ప్రవేశించారు. 2012లో పాండిరాజు దర్శకత్వం వహించిన మెరీనా సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు శివ కార్తికేయన్. ఇక ఇందులో ఓవియాతో కలిసి నటించారు. ఈ సినిమాలో ఈయన నటనకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.

సినీ కెరీర్ లో మైలురాళ్లు

ఒకవైపు హీరోగా చిన్న చిన్న సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరొకవైపు స్టాండప్ కమెడియన్ గా పనిచేస్తున్న శివ కార్తికేయన్ నటనను మెచ్చిన ఐశ్వర్య రజినీకాంత్.. ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలో ధనుష్ కి స్నేహితుడిగా అవకాశం కల్పించింది. ఈ సినిమా కూడా మంచి విజయం లభించింది ఇక అలా ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ మంచి పేరు దక్కించుకున్న ఈయన.. అటు తమిళ్లోనే కాదు తన చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు.

అలా హీరోగా పలు చిత్రాలు చేసిన ఈయన గత ఏడాది మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక తన 25వ చిత్రంగా పరాశక్తి అంటూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఇది కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఇక నిర్మాతగా సుమారుగా కొన్ని చిత్రాలకు పని చేసిన డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు.

హోస్ట్ గా కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.