|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పిరిట్ పోస్టర్‌‌లో ప్రభాస్ కాదు.. బ్రహ్మీ! పక్కన ఆ జంట హీరోయిన్ ఎవరో చూశారా?

Published: 03-01-2026, 11:30 AM
స్పిరిట్ పోస్టర్‌‌లో ప్రభాస్ కాదు.. బ్రహ్మీ! పక్కన ఆ జంట హీరోయిన్ ఎవరో చూశారా?
  • ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 1న విడుదలై వైరల్ అయింది.
  • ప్రభాస్ రఫ్ లుక్, స్టైల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
  • ప్రభాస్ స్థానంలో బ్రహ్మానందం, త్రిప్తి స్థానంలో కోవై సరళతో మీమ్ పోస్టర్ సృష్టించబడింది.
  • కామెడీ మిమ్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ నవ్వులు పూయిస్తోంది.

ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే, దీనికి బ్రహ్మానందం, కోవై సరళను జోడించి చేసిన ఒక ఫన్నీ మిమ్ నెట్టింట నవ్వులు పూయిస్తూ అంతకుమించి వైరల్ అవుతోంది. ఈ కొత్త స్పిరిట్ పోస్టర్ వెనుక ఉన్న కథేంటి?

స్పిరిట్ ఫస్ట్ లుక్: ప్రభాస్ రఫ్ లుక్ తో అంచనాలు

Spirit Poster: జనవరి 1 నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ తెగ సంచలనం సృష్టిస్తోంది. అదే స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. నూతన సంవత్సర కానుకగా అర్ధరాత్రి 12 గంటలకు విడుదలైన ఈ పోస్టర్ క్షణాల్లోనే.. వైరల్ అయింది. అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్రెండ్ చేశారు. ప్రభాస్ కొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయాడు.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా రఫ్ లుక్ లో ఒక చేతిలో సిగరెట్ మరో చేతిలో తాగే గ్లాస్ పట్టుకొని.. సరికొత్తగా కనిపించారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, నల్ల కళ్లద్దాలు, నోట్లో సిగరెట్, చేతిలో మందు గ్లాస్‌తో ప్రభాస్ రఫ్ అండ్ రెబల్ స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. వైట్ ప్యాంట్ మాత్రమే వేసుకుని, షర్ట్ లేకుండా, ఒంటి నిండా గాయాలతో ఉన్న బ్యాక్ సైడ్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా ‘యానిమల్’ని మించి ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

😂😂😂😂 pic.twitter.com/jXbbNTpzwb

వైరల్ అవుతున్న బ్రహ్మానందం, కోవై సరళ మిమ్

— EshwaRC16 Raj(Dhfc) 🐎 (@EshwarDhfc) January 3, 2026

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక భారీ యాక్షన్ డ్రామా. ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘స్పిరిట్.. వన్ బ్యాడ్ హ్యాబిట్’ ప్రోమోకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది.

ఇక ఈ సీరియస్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో ఫన్నీ టచ్ కూడా వచ్చింది. ప్రభాస్ స్థానంలో బ్రహ్మానందం.. త్రిప్తి దిమ్రి స్థానంలో కోవై సరళ కనిపించేలా ఒక క్రియేటివ్ మిమ్ పోస్టర్ తయారు చేశారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. సీరియస్ లుక్‌కు ఇలా కామెడీ మిక్స్ కావడంతో ఈ మిమ్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకప్పుడు బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకుల మదిలో ఎలాంటి స్థానం సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ సూపర్ హిట్ జంట ఈ పోస్టర్లో కనిపించి మరోసారి అందరిని అలరించారు.

స్పిరిట్ సినిమా విశేషాలు: దర్శకుడు, తారాగణం

స్పిరిట్ సినిమాను టీ-సిరీస్.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెలుగు సహా పలు భాషల్లో విడుదల చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి, సీరియస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఫన్నీ మిమ్స్ కలిసి ‘స్పిరిట్’ సినిమాను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చాయి. కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచే ప్రభాస్ పేరు నెట్టింట మార్మోగుతూనే ఉంది.

ప్రభాస్ ‘స్పిరిట్’ పోస్టర్ హైప్‌ను పెంచిన ఈ ఫన్నీ మీమ్, బ్రహ్మానందం-కోవై సరళల హిట్ కాంబినేషన్ ను గుర్తుచేసింది. అభిమానుల సృజనాత్మకతకు అద్దం పడుతూ, సీరియస్ పోస్టర్‌కు కామెడీ టచ్ ఇచ్చి నెటిజన్లను అలరిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.