|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్రవంతి సంచలన వ్యాఖ్యలు! అనసూయ ఎఫెక్ట్ నిజమేనా? అసలు విషయం చెప్పిన స్రవంతి చొక్కారపు!

Published: 28-02-2026, 1:05 PM
స్రవంతి సంచలన వ్యాఖ్యలు! అనసూయ ఎఫెక్ట్ నిజమేనా? అసలు విషయం చెప్పిన స్రవంతి చొక్కారపు!
  • స్రవంతి చొక్కారపుకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒక మైలురాయిగా నిలిచింది.
  • అల్లు అరవింద్ స్రవంతి తెలుగు భాషా పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.
  • బిగ్ బాస్ తర్వాత స్రవంతి పాపులారిటీ మరింత పెరిగిందని ఆమె అన్నారు.
  • తన ఎదుగుదలకు కారణం తన కష్టమేనని స్రవంతి స్పష్టం చేసింది.

యాంకర్ స్రవంతి చొక్కారపు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనసూయ వెళ్లిపోవడం తన ఎదుగుదలకు కారణం కాదని, తన కష్టం, సమయం కలిసిరావడం వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆమె తెలిపారు.

స్రవంతి కెరీర్ మలుపు

Sravanthi Chokkarapu interview: యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి చొక్కారపు ఈ మధ్య కాలంలో సినిమాలు, ఈవెంట్లు, టీవీ షోలతో బాగా బిజీగా మారింది. ఇటీవల సుహాస్ హీరోగా వచ్చిన హే బలవంత్ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ద్వారా నటిగా కూడా ఆమెపై ప్రేక్షకుల దృష్టి పడింది.

స్రవంతి కెరీర్ విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ స్రవంతిని ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “యాంకర్ అనసూయ సినిమాల వైపు వెళ్లడం, అలాగే కొంతమంది యాంకర్లు రాజకీయాల్లోకి వెళ్లడం వల్లనే మీకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా వచ్చాయా? బిగ్ బాస్ తర్వాతే మీ కెరీర్ మారిందా?” అని అడిగారు.

అల్లు అరవింద్ ప్రశంసలు

దానికి స్రవంతి సమాధానం చెబుతూ.. తనకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల అవకాశాలు బిగ్ బాస్‌కు ముందే వచ్చాయని చెప్పింది. ముఖ్యంగా అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తన జీవితంలో చాలా కీలకమని తెలిపింది. ఆ ఈవెంట్‌కు ఏలూరు శ్రీను అనే వ్యక్తి తన పేరును సూచించారని చెప్పింది.

ఆ రోజు ఈవెంట్ కోసం తాను చాలా కష్టపడ్డానని, డైలాగులు అన్నీ ముందే రాసుకొని, అచ్చమైన తెలుగులో ప్రోగ్రామ్‌ను బాగా నిర్వహించానని స్రవంతి గుర్తు చేసుకుంది. ఆ ఈవెంట్ చూసిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ కూడా తనను ప్రశంసించారని చెప్పింది. అదే తనకు మరిన్ని అవకాశాలకు దారి తీసిందని తెలిపింది.

స్రవంతి సక్సెస్ సీక్రెట్

ఆ తర్వాతే తనకు బిగ్ బాస్ తెలుగు అవకాశం వచ్చిందని స్రవంతి చెప్పింది. బిగ్ బాస్ తర్వాత మరిన్ని షోలు, ఈవెంట్లు చేయడం వల్ల తన పాపులారిటీ ఇంకా పెరిగిందని వివరించింది. ఎవరో వెళ్లిపోవడం వల్ల తనకు అవకాశాలు వచ్చాయన్న మాటల్లో నిజం లేదని, తన కష్టం, టైమింగ్, అవకాశాలే తనను ఇక్కడికి తీసుకొచ్చాయని స్రవంతి స్పష్టంగా చెప్పింది.

స్రవంతి తన కష్టంతోనే ఈ స్థాయికి ఎదిగారని స్పష్టమవుతోంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తన టాలెంట్ తో ఆమె ముందుకెళ్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.